మా నాన్న సంఘీ కాదు: ఐశ్వర్య

TeluguCinema Team 27 Jan 2024
Aishwarya Rajinikanth

సూపర్ స్టార్ రజినీకాంత్ బీజేపీ ఏజెంట్ అని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారం వల్లే కొన్నాళ్ళూ తమిళనాడులో ఆయన సినిమాలు ఆడలేదు. తమిళనాట రజినీకాంత్ ని “పరాయివాడిగా” చూపించే ప్రయత్నం కూడా జరిగింది. దాంతో రజినీకాంత్ రాజకీయ ఆలోచనలు విరమించుకున్నారు.

ఆయన రాజకీయాలకు దూరంగా జరిగాకే మళ్ళీ తమిళనాడులో సినిమాలు ఆడడం మొదలైంది. అందుకు రుజువు… “జైలర్” సినిమా ఘన విజయం. అంతకుముందు అన్నీ ఫ్లాపులే.

ఈ విషయం రజినీకాంత్, వారి కుటుంబసభ్యులకు తెలుసు. అందుకే తాజాగా రజినీకాంత్ కూతురు ఐశ్వర్య ఈ విషయం మాట్లాడారు. ఆమె మాటలకు రజినీకాంత్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.

ఐశ్వర్య “లాల్ సలామ్” అనే సినిమా తీస్తున్నారు. ఇందులో ముస్లిం వ్యక్తిగా రజినీకాంత్ అతిథిపాత్రలో కనిపిస్తారు. ఈ సినిమా ఆడియో కార్యక్రమంలో ఆమె మాట్లాడింది. ఈ కార్యక్రమానికి రజినీకాంత్ కూడా హాజరయ్యారు.

“మా నాన్నని అందరూ సంఘీ అని పిలుస్తున్నారు అని తెలిసినప్పుడు చాలా కోపం వచ్చింది. ఒక రాజకీయ పార్టీకి ఆయన మద్దతుగా ఉంటారనే భావనతో సంఘీ అని పిలుస్తున్నారు అని మా టీం చెప్పింది. అందుకే నాన్న గురించి నెగెటివ్ మాటలు స్ప్రెడ్ చేశారు అని తెలిసింది. రజనీకాంత్ అలా సంకుచిత మనస్తత్వం కలిగిన వారు కాదు. ఆయన ఎప్పటికీ సంఘీ కారు,” అని ఐశ్వర్య మాట్లాడింది.

TeluguCinema Team

TeluguCinema Desk is the editorial team behind TeluguCinema.com, one of the oldest and most trusted websites dedicated to the Telugu film industry since the late 1990s. With decades of experience in entertainment journalism, the team is committed to delivering accurate news, credible reports, exclusive updates, and insightful features while upholding the highest standards of fairness, authenticity, and journalistic integrity.

View all posts

Recent News