హాస్పిటల్ బెడ్ పై నుంచి డబ్బింగ్

‘మనం’ సినిమాకు సంబంధించి అక్కినేని నాగేశ్వరరావు ఆఖరి కోరికను బయటపెట్టారు నాగార్జున. ఆ సినిమాకు తనే డబ్బింగ్ చెబుతానని ఏఎన్నార్ పట్టుబట్టారట. దీంతో ఆయన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసి మరీ డబ్బింగ్ చెప్పించారట.
కెరీర్ లో ఎప్పుడూ అక్కినేనికి వేరే వ్యక్తి డబ్బింగ్ చెప్పలేదు. మొదటి సినిమా నుంచి అఖరి చిత్రం వరకు ఆయనే డబ్బింగ్ చెప్పుకున్నారు. అయితే ‘మనం’ సినిమా షూటింగ్ లో ఆయనకు కాన్సర్ అనే విషయం బయటపడింది.
దీంతో నాగార్జున, తన తండ్రికి పూర్తి విశ్రాంతి కల్పించారు. ఇంట్లోనే ఐసీయూ బెడ్ ఏర్పాటు చేశారు. అప్పటికి ఏఎన్నార్ పార్ట్ షూట్ కంప్లీట్ అయింది. డబ్బింగ్ మాత్రమే పెండింగ్. దాన్ని ఎవరితోనైనా చెప్పించాలని నాగ్ అనుకున్నారు.
అయితే అక్కినేని నాగేశ్వరరావు మాత్రం అంగీకరించలేదంట. తన పాత్రలకు తనే డబ్బింగ్ చెప్పుకుంటానని, చివరి శ్వాస వరకు సినిమా కోసం పనిచేస్తానని, అదే తన చివరి కోరిక అని చెప్పారట. దీంతో తప్పనిసరి పరిస్థితుల మద్య ఐసీయూ బెడ్ పైనుంచే ఏఎన్నార్ తో డబ్బింగ్ చెప్పించారట నాగ్.