కాపురం సూపర్: కియారా

హీరోయిన్ కియారా అద్వానీ గత నెలలోనే తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకొంది. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాని ప్రేమించి పెళ్లాడింది. కియారా మళ్ళీ షూటింగ్ లతో బిజీ అయింది. రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో ఆమె నటిస్తోంది. తాజాగా ఒక పాటని హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్నారు.

ఈ సినిమా సాంగ్ షూటింగ్ కోసం ముంబై నుంచి హైదరాబాద్ బయలుదేరినప్పుడు అక్కడి జర్నలిస్ట్ లు ఎయిర్పోర్ట్ లో ఆమెని కాపురం ఎలా ఉందని ప్రశ్నించారు.

కాసేపు సిగ్గుపడి, ఆ తర్వాత నవ్వి,”సూపర్ గా ఉంది,” అని సమాధానం ఇచ్చింది.

మరోవైపు, కియారా అద్వానీ గర్భవతి అన్న వార్తలు కూడా తప్పు అయ్యాయి. ఆమె ప్రెగ్నెంట్ కావడం వల్లే సిద్ధార్థ్ మల్హోత్రాతో హడావిడిగా పెళ్లి చేసుకుందని ఈ మధ్య పుకార్లు షికార్లు చేశాయి. కానీ, కియారా వరుసగా సినిమా షూటింగ్ లు చేస్తోంది. సో, ఆ వార్తలు నిజం కాదు అన్నమాట.

Advertisement
 

More

Related Stories