అటు పవన్, ఇటు సూర్య!

వంశీ పైడిపల్లి, పరశురామ్… ఈ ఇద్దరి దర్శకుల పరిస్థితి విచిత్రంగా ఉంది. వంశీ పైడిపల్లికి హిట్స్ ఉన్నాయి కానీ హీరోలు డేట్స్ ఇవ్వడం లేదు. పరశురామ్ కి అపజయాలు పలకరించాయి. దాంతో హీరోలు డేట్స్ ఇవ్వడం లేదు. కానీ ఇద్దరూ పెద్ద హీరోల చుట్టే తిరుగుతున్నారు.
“బృందావనం”, “ఎవడు”, “ఊపిరి” “మహర్షి” వంటి చిత్రాలు తీసిన వంశీ పైడిపల్లి విజయ్ తో తమిళంలో “వరిసు” అనే సినిమా రూపొందించాడు. ఆ సినిమా యావరేజ్ గా ఆడింది. ఆ తర్వాత అమీర్ ఖాన్ కి ఒక కథ చెప్పాడు. మొదట ఓకె చెప్పిన అమీర్ ఖాన్ ఆ తర్వాత రిజెక్ట్ చేశారు. కొన్నాళ్ళూ సల్మాన్ ఖాన్ చుట్టూ తిరిగారు వంశీ పైడిపల్లి.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేస్తున్నారట. నిర్మాత దిల్ రాజుకి ఒక సినిమా చేస్తానని పవన్ కళ్యాణ్ ఇటీవల మాటిచ్చారని టాక్. దాంతో, దిల్ రాజు వంశీ పైడిపల్లిని కథ రెడీ చేసుకోమని చెప్పినట్లు సమాచారం.
మరోవైపు, “గీత గోవిందం” వంటి సంచలన హిట్ ఇచ్చిన పరశురామ్ ఇటీవల “సర్కార్ వారి పాట”, “ఫ్యామిలీ స్టార్” వంటి ఫ్లాపులు ఇచ్చాడు. దాంతో, పరశురామ్ తో వెంటనే సినిమా చేసేందుకు హీరోలు ఆసక్తి చూపడం లేదు. దాంతో తమిళ హీరో సూర్యకి కథ చెప్పి, ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నాడు పరశురామ్.
ఇప్పుడు ఈ దర్శకుల భవితవ్యం పవన్, సూర్యల మీద ఆధారపడి ఉంది.