పుష్ప ప్రచారం మళ్ళీ మొదలు

Srivalli

‘పుష్ప’ సినిమా నుంచి మొదటి పాట ఆగస్ట్ 13న విడుదలైంది. “దాక్కో దాక్కో మేక” అనే పాటకి మిశ్రమ స్పందన వచ్చింది. కానీ యూట్యూబ్ లో వ్యూస్ బాగా వచ్చాయి.

ఇంతకుముందు ప్రతి నెలా ఒక పాట రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సెప్టెంబర్ లో సాంగ్ రిలీజ్ చెయ్యలేదు. సినిమా విడుదల వాయిదా వెయ్యాల్సి వస్తుందేమో అన్న అనుమానంతో గత నెలలో సాంగ్ రిలీజ్ చెయ్యలేదు. కానీ డిసెంబర్ 17న ‘పుష్ప: ది రైజ్’ రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ అయ్యాక ఇప్పుడు రెండో పాటని వదులుతున్నారు.

రష్మిక మందన్నపై చిత్రీకరించిన “శ్రీవల్లి” అనే పాటను అక్టోబర్ 13న విడుదల చేయనున్నారు దర్శక నిర్మాతలు. రష్మిక ఈ సినిమాలో శ్రీవల్లిగా నటిస్తోంది.పూర్తిగా డీ గ్లామర్ పాత్ర పోషిస్తోంది రష్మిక.

దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్, దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన సినిమాల పాటలు బాగా క్లిక్ అయ్యాయి. ఈ మూవీ పాటలు ఆ రేంజులో ఉంటాయా అన్నదే అందరిలో ప్రశ్న. మొదటి పాట వరకు అంచనాలు అందుకున్నారు. మిగతావి ఎలా ఉంటాయి అన్నది చూడాలి.

Advertisement
 

More

Related Stories