టైసన్ రాహుల్ కొత్త సినిమా

Tyson Rahul

రాహుల్ టైసన్ గుర్తున్నాడా? శేఖర్ కమ్ముల తీసిన “హ్యాపీ డేస్”లో ఒక హీరోగా నటించాడు. అలాగే, “రెయిన్ బో”, “లవ్ యు బంగారం”, “వెంకటాపురం”, వంటి సినిమాల్లో నటించాడు. కొంత గాప్ తర్వాత హీరోగా కొత్త సినిమా మొదలుపెట్టాడు.

విరాట్ చక్రవర్తి దర్శకత్వంలో ఈ సినిమా షురూ అయింది. మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ ఈ సినిమాతో నిర్మాతగా మారాడు. నాగం తిరుపతి రెడ్డి, శ్రీకాంత్ గార్లతో కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నాడు. కన్నడంలో పలు సినిమాలు చేసిన చేతన్ మరో హీరోగా నటించాడు. సాక్షి చౌదరి, ఐశ్వర్య హీరోయిన్లుగా నటిస్తున్నారు.

జనవరిలోపే షూటింగ్ పూర్తి చేస్తామని మేకర్స్ అంటున్నారు.

Advertisement
 

More

Related Stories