రజినీకాంత్ కి బ్రదర్ దీవెన!

Rajinikanth

సూపర్ స్టార్ రజినీకాంత్ పార్టీ పెట్టనున్నాడు. జనవరి 2021లో తన పార్టీ పేరుని ప్రకటిస్తాడు. పార్టీ పెట్టాలని ఫిక్స్ అయ్యాక… ఇక పెద్దల ఆశీర్వాదాలు తీసుకుంటున్నాడు. పలు దేవాలయాల్లోనూ పూజలు చెయ్యనున్నారు రజినీకాంత్. తాజాగా బెంగుళూర్ లో నివాసం ఉండే తన అన్నయ్య సత్యనారాయణ ఇంటికి వెళ్లి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు సూపర్ స్టార్.

అలాగే కమల్ హాసన్ సహా కోలీవుడ్ లోని తన స్నేహితులను కూడా రజినీకాంత్ కలిసి వారి మద్దతు, దీవెనలు కోరుతాడట.

మొదట రజినీకాంత్… రాజకీయ పార్టీ విషయంలో ఊగిసలాడాడు. కానీ అన్ని ఆలోచించుకున్న తర్వాత ఎన్నికల బరిలో దిగాలని వస్తున్నాడు. రజినీకాంత్ రాజకీయాలోకి రావాలని 1990లలోనే అనుకున్నాడు. జయలలితకి ఓటేస్తే ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు అని 20 ఏళ్ల క్రితం రజినీకాంత్ అన్న మాటకు ఆమె పార్టీ ఘోరంగా ఓడింది. ఆ లెవల్లో రజినీకాంత్ కి అప్పట్లో ఫాలోవింగ్, ఇమేజ్ ఉండేది.

ఇప్పుడు తమిళనాట సీన్ మారింది. రజినీకాంత్ కి ఒకప్పటి క్రేజ్ లేదు, రాజకీయంగా ఆయన్ని బీజేపీ ఏజెంట్ గా ఆల్రెడీ ముద్రేశారు. అది ఆయనకి పెద్ద మైనస్.

Advertisement
 

More

Related Stories