భీమ్లా నాయక్ తర్వాతే దానికి మోక్షం!

Rana

రానా హీరోగా నటించిన ‘విరాటపర్వం’ సినిమా మొదలై దాదాపు మూడేళ్లు కావొస్తోంది. ఇంకా ఆ సినిమా విడుదల కాలేదు. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ షూటింగ్ కూడా పూర్తి అయింది. ఐతే, థియేటర్లో విడుదల చెయ్యాలా? ఓటిటిలోనా అన్న డైలమాలో సగం టైం గడిచింది. ఇప్పుడు థియేటర్లు అన్ని ఓపెన్ అయిన టైంలో థియేటర్లలో కాకుండా డైరెక్ట్ గా ఓటిటిలో రిలీజ్ చేస్తే… విమర్శలు ఎదుర్కోకతప్పదు.

అందుకే, ‘భీమ్లా నాయక్’ విడుదల తర్వాత ఆలోచిస్తారేమో ‘విరాటపర్వం’ గురించి. అన్నీ అనుకున్నట్లు జరిగితే, పవన్ కళ్యాణ్, రానా నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ సంక్రాంతికి విడుదల అవుతుంది. లేదంటే, మార్చికో, ఏప్రిల్ కో వాయిదా పడుతుంది.

మరి ‘విరాటపర్వం’ సినిమాని ఎప్పుడు విడుదల చేస్తారు? సంక్రాంతికి ‘భీమ్లా నాయక్’ విడుదలై విజయం సాధిస్తే రానాకి హెల్ప్ అవుతుంది. అప్పుడు ‘విరాటపర్వం’ థియేటర్లో విడుదల గురించి ఒక నిర్ణయం తీసుకుంటారు. లేదంటే ఓటిటి వైపు మొగ్గు చూపొచ్చు.

ఇప్పటికే చాలామంది ఈ సినిమా ఉందన్న విషయాన్ని మర్చిపోయారు. టీజర్ విడుదలైనప్పుడు, మొదటి పాట వచ్చినప్పుడు మంచి క్రేజ్ వచ్చింది. వేణు అడుగుల దర్శకత్వం వహించిన ఈ మూవీ నక్సలిజం నేపథ్యంగా సాగే పీరియడ్ ప్రేమకథాచిత్రం.

Advertisement
 

More

Related Stories