అవును విడిగా ఉంటున్నారు!

హీరో శర్వానంద్, ఆయన భార్య విడిపోయారు, విడాకులకు అప్లై చేశారు అన్న వార్తలు గుప్పుమన్నాయి. ఇందులో నిజానిజాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేసింది తెలుగుసినిమా. కామ్.
శర్వానంద్, ఆయన భార్య రక్షిత రెడ్డికి రెండున్నర ఏళ్ల క్రితం పెళ్లి అయింది. వీరికి ఒక పాప కూడా కలిగింది. కానీ ఇటీవల ఇద్దరి మధ్య కొన్ని విషయాల్లో గొడవలు కలగడంతో కొన్ని నెలలుగా విడిగా ఉంటున్నారు అని తెలిసింది. కలిసి ఉండడం లేదు. కానీ విడాకులు తీసుకోలేదు, అప్లై చెయ్యలేదు.
రక్షిత రెడ్డి బాగా చదువుకున్నారు. పెద్ద కంపెనీలో పనిచేశారు. ఆమె కుటుంబం కూడా పేరున్న రాజకీయ కుటుంబం. ఇక శర్వానంద్ చాలా సాఫ్ట్ హీరో. మరి వీరికి ఏ విషయంలో గొడవలు వచ్చాయో తెలీదు కానీ విడిగా ఉండాలని నిర్ణయించుకొన్నారు. మళ్లీ కలుస్తారా? లేక కోర్టు మెట్లు ఎక్కుతారా అనేది చూడాలి.
ఇరువైపులా పెద్దలు మాత్రం ఇద్దరి మధ్య రాజీ కుదిరించే ప్రయత్నం చేసున్నారు.
మరోవైపు శర్వానంద్ కెరీర్ కూడా అనేక ఇబ్బందుల్లో ఉంది. ఆ మధ్య విడుదలైన “మనమే” అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక “నారీ నారీ నడుమ మురారి” చిత్రం విడుదలకు ఇబ్బందులు పడుతోంది. “రేసర్” అనే మరో చిత్రం ఇంకా షూటింగ్ పూర్తి చేసుకోలేదు.