ముందున్నది సిద్ధూకి పెద్ద టెన్షన్

సిద్ధూ జొన్నలగడ్డ ఇటీవల పెద్ద ఫ్లాప్ చూశాడు. “జాక్” సినిమా ఘోర పరాజయం పాలు కావడం అతనికి పెద్ద షాక్. అంతకుముందు ఇచ్చిన హిట్స్ అన్నింటిని జనం మర్చిపోయారు. ఇప్పుడు మళ్ళీ తాను ఓపెనింగ్స్ రాబట్టగలనని నిరూపించుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు.
వచ్చే నెలలో “తెలుసు కదా” అనే సినిమాతో మన ముందుకు రానున్నాడు. దాని టీజర్ తాజాగా విడుదలైంది.
ALSO READ: Telusu Kada Teaser: Two girls, one man, endless romance
ఇందులో ఇద్దరి భామల కౌగిలిలో నలిగిన కృష్ణుడిగా కనిపిస్తాడు సిద్ధూ. ఐతే, ఈ సినిమాకి పెద్దగా క్రేజ్ లేదు. దర్శకురాలు నీరజ కోనకి ఇదే మొదటి చిత్రం. పాటలు ఇంకా వైరల్ కాలేదు. టీజర్ ఫర్వాలేదు అన్నట్లుగా ఉంది. ఈ సినిమాకి హైప్ తీసుకురావడం పెద్ద ఛాలెంజ్ సిద్ధూకి. అదే టెన్షన్.
హీరోయిన్ లకు కూడా పెద్దగా క్రేజ్ లేదు. సో, భారమంతా సిద్ధూపైనే. మరి ఈ సినిమాకి అతను ఎలా హైప్ తెస్తాడో చూడాలి.