శ్రీజ…ఏంటా పోస్ట్!?

Sreeja

మెగా ఇంట పెళ్లి వేడుక అయితే ముగిసింది. ఇటలీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక మెగా ఫ్యామిలీ ఇటలీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న వీడియోలు సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మెగాస్టార్ ముద్దుల కూతురు శ్రీజ తన భర్తతో విడిపోయినప్పటి నుంచి తన లైఫ్‌లో బిజీ అయిపోయింది. మరోవైపు.. సోషల్ మీడియాలో సైతం యమా యాక్టివ్ అయిపోయింది. ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ సందడి చేస్తోంది. అంతా బాగానే ఉంది కానీ తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది.

‘పరిస్థితులు అస్తవ్యస్తంగా మారినప్పుడు హృదయం గాయపడుతుంది’ అంటూ శ్రీజ తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. విషయాలు మన నియంత్రణలో లేనప్పుడు పరిస్థితులు అస్తవ్యస్తంగా మారి ఇబ్బందికరంగా తయారైనప్పుడు హృదయం గాయపడుతుందని శ్రీజ పేర్కొంది. అలాగే మనసు విరిగిపోతుందని మనసు కలత చెంది ఆపై క్షీణిస్తుందని.. అదే సమయంలో శరీరం కూడా అలసిపోయి బలహీనంగా తయారవుతుందని తెలిపింది.

అలాంటి దుర్భర పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక్కసారి కళ్లు మూసుకుని మనలోకి మనం వెళ్లాలని శ్రీజ తెలిపింది. అప్పుడు మనతో మనమే కనెక్ట్ అయితే అన్నీ సెట్ అవుతాయని ఇదొక్కటే అలాంటి పరిస్థితుల నుంచి బయట పడటానికి మార్గమని వెల్లడించింది.

అసలు శ్రీజకు ఏమైంది? పెళ్లిలో సందడిగా గడిపిన ఆమె ఇంతలోనే ఇంత నిర్వేదమేంటని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Advertisement
 

More

Related Stories