స్టార్ మా కొత్త సీరియల్ “నువ్వు నేను ప్రేమ”

Nuvvu Nenu Prema

మరో కొత్త తరహా కథ తో స్టార్ మా ఓ సరికొత్త సీరియల్ ని అందించడానికి సర్వం సిద్ధం చేసింది. ఈ కొత్త సీరియల్ పేరు “నువ్వు నేను ప్రేమ”.

ఈరోజు సాయంత్రం 06.30 గంటలకు ఈ సీరియల్ ప్రారంభం కాబోతోంది. ప్రతివారం సోమవారం నుంచి శనివారం వరకు ఈ సీరియల్ ప్రసారమవుతుంది. ఇందులో కేవలం ప్రేమ మాత్రమే కాదు.. రెండు కుటుంబాలు, బంధాలు, మమతానురాగాలు, బాధ్యతలు అన్నీ కలిసిన అందమైన కుటుంబ కథ.

ఫామిలీ లో అందరికీ కావాల్సిన ఎమోషన్స్, సెంటిమెంట్స్ అన్నిటినీ ఈ సీరియల్ అందిస్తుంది. ఒకరిని ఒకరు చూసుకోడానికి కూడా ఇష్టపడని ఇద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలవుతుంది? తరవాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ?.. లాంటి ప్రశ్నలకు సమాధానం ఈ సీరియల్ “నువ్వు నేను ప్రేమ”. ఇష్టపడే ఛాన్స్ లేని ఇద్దరి మధ్య ప్రేమ పుట్టడమే ఈ సీరియల్ లో కొత్త విషయం. అందుకే “నువ్వు నేను ప్రేమ” ని తప్పకుండా చూడండి.

“నువ్వు నేను ప్రేమ” ప్రోమో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి:

సరికొత్త సీరియల్ "నువ్వు నేను ప్రేమ" ఈనెల 16 న ప్రారంభం సోమ - శని 6 .30 pm #NuvuNenuPrema #StarMaa

Content Produced by: Indian Clicks, LLC

 

More

Related Stories