TC2022: సమంత కెరీర్ అదుర్స్ కానీ!

Samantha

నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత మళ్ళీ హీరోయిన్ గా నిలబడేనా అన్న డౌట్స్ ‘పుష్ప’ సినిమాతోనే పటాపంచలు అయ్యాయి. ఆ సినిమాలో ఐటెం సాంగ్ తో అదరగొట్టింది. అది గతేడాది. 2022లో సమంత నటించిన రెండు సినిమాలు విడుదల అయ్యాయి. ఒకటి ‘కన్మణి రాంబో కతిజ’ అనే తమిళ చిత్రం. తమిళంలో ఈ సినిమా మోస్తరుగా ఆడింది.

ఇక తెలుగులో ఆమె సోలో హీరోయిన్ గా నటించిన చిత్రం…యశోద. ఏడాది చివర్లో విడుదలైంది ఈ మూవీ. సమంత స్టామినాను మరోసారి ఎలివేట్ చేసింది ఈ మూవీ. సొంతంగా ఏ హీరో అవసరం లేకుండా ఓపెనింగ్స్ రాబట్టగలనాన్ని ప్రూవ్ చేసింది.

సమంత అంటే అందర్లా కేవలం ఓ హీరోయిన్ కాదు. ఆమె ఇప్పుడో క్రౌడ్ పుల్లర్. సమంత కోసం ప్రత్యేకంగా సినిమా థియేటర్లకు వచ్చే జనం ఉన్నారు. ప్రస్తుతం సమంత చేతిలో శాకుంతలం, ఖుషి సినిమా ఉన్నాయి. ‘ఖుషి’లో విజయ్ దేవరకొండ హీరో. కానీ ‘శాకుంతలం’ మాత్రం పూర్తిగా సమంత సినిమా. ఈ మూవీతో కొత్త ఏడాదిలో మరోసారి తన సత్తా చాటనుంది ఈ అందగత్తె.

ALSO READ: TC2022: ఈ ఏడాదీ రాజమౌళిదే!

2022లో కూడా సమంత పుకార్లని తప్పించుకోలేకపోయింది. ఆమె అనారోగ్యంతో సతమతమవుతోంది. ‘మయోస్టిస్’ అనే వ్యాధితో సతమతమవుతున్న ఆమెకి 2022 మిక్స్డ్ రిజల్ట్ ఇచ్చింది. కెరియర్ కుదుటపడింది… కానీ పర్సనల్ లైఫ్ ఇంకా పూర్తిగా కుదురుకోలేదు.

Advertisement
 

More

Related Stories