మహేష్ బాబుకి రాముడి లింక్!

TeluguCinema Team 10 Nov 2025
GlobeTrotter

ఈ శనివారం (నవంబర్ 15) నాడు మహేష్ బాబు – రాజమౌళి సినిమాకి పేరు ఏంటో తెలిసిపోతుంది. మహేష్ బాబు ఈ సినిమాలో ఎలా కనిపిస్తాడో కూడా అర్థం అవుతుంది. సినిమాలో ఉండే సర్ప్రైజ్ లు ఎలా ఉన్నా.. మహేష్ బాబు పాత్ర గురించి కూడా మనకు కొంచెం అర్థం అవుతుంది.

నవంబర్ 15న రామోజీ ఫిలిం సిటీలో జరిగే భారీ ఈవెంట్ లో ఈ సినిమా టైటిల్ గ్లిమ్ప్స్ వీడియోని విడుదల చెయ్యనున్నారు. ఐతే, ఈ లోపే మహేష్ బాబు అభిమానులు, సోషల్ మీడియా ఫిలిం లవర్స్ రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు.

మహేష్ బాబు ఇందులో శ్రీరాముడి వంశంలో పుట్టినవాడిగా కనిపిస్తాడని కొందరు, శ్రీరాముడు మళ్ళీ పుట్టినట్లుగా రాజమౌళి చూపిస్తాడని మరికొందరు, హనుమంతుడి తరహాలో మహేష్ బాబు పాత్ర ఉంటుంది అని ఇంకొందరు కథలు అల్లేస్తున్నారు.

ఈ సినిమా కథని విల్బర్ స్మిత్ అనే ఆఫ్రికన్ రచయిత రాసిన నవలలోని కొన్ని పాత్రలు, సన్నివేశాల ఆధారంగా అల్లారు రాజమౌళి. ఆ నవలలోని మేటర్ కి మన భారతదేశ పురాణ, ఇతిహాస గాథలను మిక్స్ చేసి తనదైన శైలిలో తీస్తున్నారు. లేనిదాన్ని ఉన్నట్లుగా ఊహించి తీయడంలో రాజమౌళి ఎక్స్పర్ట్.

రాజమౌళి ఏమి తీస్తున్నారో, మన రామాయణ,ఇతర ఇతిహాస గాథలకు ఎలా కలుపుతున్నారో తెలియదు. కానీ రాముడు, ఆంజనేయుడు అంశ ఉన్న హీరోగా మహేష్ బాబు కనిపిస్తాడని అభిమానులు ఊహించేసుకుంటున్నారు.

ముఖ్యంగా విలన్ (పృథ్వీరాజ్ సుకుమారన్) పాత్రకు, హీరో పాత్రకు, రామాయణంలోని సంజీవని కథకు లింక్ ఉంటుంది అని వీళ్లు చెప్తున్నారు.

TeluguCinema Team

TeluguCinema Desk is the editorial team behind TeluguCinema.com, one of the oldest and most trusted websites dedicated to the Telugu film industry since the late 1990s. With decades of experience in entertainment journalism, the team is committed to delivering accurate news, credible reports, exclusive updates, and insightful features while upholding the highest standards of fairness, authenticity, and journalistic integrity.

View all posts

Recent News