Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Faria Abdullah: ‘గాయపడ్డ సింహం’ హిలేరియస్ ఉంటుంది

TeluguCinema, April 27, 2026April 27, 2026
Faria Abdullah

ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) “జాతి రత్నాలు” సినిమాతో ఫేమస్ అయింది. ఆమె చేసే సినిమాలు ఎక్కువగా కామెడిగానే ఉంటాయి. ఇప్పుడు ‘గాయపడ్డ సింహం'(Gaayapadda Simham)తో మరోసారి మెప్పించనుంది. మే 1వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రం గురించి ఫరియా అబ్దుల్లా చెప్తున్న విశేషాలు…

మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?

ఇందులో నా పాత్ర పేరు శాలిని. తను ఒక వ్లాగర్. ఇందులో తరుణ్ గారితో ఒక రొమాంటిక్ ట్రాక్ కూడా ఉంటుంది. డైరెక్టర్ కశ్యప్ చాలా డిఫరెంట్‌గా రాశారు. ఆయన ప్రపంచం, సృష్టించిన పాత్రలు అన్నీ చాలా హిలేరియస్ గా వచ్చాయి. మల్టిపుల్ లేయర్స్‌లో జరిగే కథ ఇది. ప్రతి పాత్రకి ప్రాముఖ్యత ఉంటుంది. నా పాత్ర పూర్తిగా హాస్యభరితంగా సాగుతుంది. ఈ సినిమాలో రైటింగ్ చాలా ఫన్నీగా ఉంది. డైరెక్టర్ కశ్యప్ ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ కూడా చేశారు. ఆయన యాక్టింగ్, డైరెక్షన్ రెండూ అద్భుతంగా ఉన్నాయి.

మీ కథల ఎంపిక ఎలా ఉంటుంది?

కథ విన్నప్పుడు నచ్చితే పాత్ర పెద్దదా చిన్నదా అని చూడకుండా తప్పకుండా చేస్తాను. ఈ సినిమా కథ చాలా క్రేజీగా ఉంటుంది. వినగానే కొత్తగా అనిపించింది.

తరుణ్ భాస్కర్, శ్రీ విష్ణులతో నటించడం ఎలా అనిపించింది?

తరుణ్ భాస్కర్ గారు చాలా సరదాగా ఉంటారు. ఆయన కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఆయనతో సీన్స్ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ఆయన చిన్న ఎక్స్‌ప్రెషన్ ఇచ్చినా నాకు నవ్వు వచ్చేస్తుంది. ఇందులో శ్రీ విష్ణు గారి పాత్ర చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. కొత్తగా ఉంటుంది.

దుల్కర్ సల్మాన్ అంటే చాలా ఇష్టం అని చెప్పారు. ఆయన చిత్రంలో చిన్న పాత్ర ఒప్పుకుంటారా?

చిన్న పాత్ర కాదు ఫుల్ లెంగ్త్ రోల్ చెయ్యాలని ఉంది.

మీరు డైరెక్ట్ కాబోతున్నారట?

అవును. వచ్చే ఏడాది నా డైరెక్షన్లో మూవీ ఉంటుంది.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Varanasi
    Varanasi: రాజమౌళి మూవీ ఏప్రిల్ 7 నుంచి వాయిదా పడుతుందా?
  • Srinidhi shetty
    Srinidhi Shetty: నిర్మాతల కోరికని మన్నించని అందాల నిధి
  • Sobhita
    అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita
  • Pooja Hegde
    Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!
  • Samantha
    తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: కొత్తగా కథలు వింటున్నాను
  • Naga Durga
    Naga Durga: ఎన్నో కండీషన్లు, అయినా అవకాశాలు!
  • Prithviraj Sukumaran
    Prithviraj Sukumaran: హీరో కాలులో 3 స్క్రూలు!
  • Preity Mukhundhan
    Preity Mukhundhan: ఈ ఆరు ‘ప్రీతి’పాత్రమైనవి
  • Venkatesh
    Venkatesh: రెండు హిట్లతో పారితోషికం భారీగా పెంపు
  • Nani
    The Paradise: నాని తెగ వర్రీ అవుతున్నారట
  • Sai Pallavi
    తెలిసి కూడా ముద్దు అడుగుతుంటారు: Sai Pallavi
  • Nidhhi Agerwal
    Nidhhi Agerwal: డబ్బున్న మగాడు కోసం వెదుకుతున్నాను!
  • Kiara Advani and Yash in Toxic
    Toxic: ఆ పుకార్లు నిజం కాదని ప్రూవ్ చేసింది కియరా
  • Krithi Shetty
    Krithi Shetty: నన్ను గ్లామర్ కి వాడుకొండి అని చెప్తోందా!

Recent News

  • Varanasi: రాజమౌళి మూవీ ఏప్రిల్ 7 నుంచి వాయిదా పడుతుందా?
  • Nandamuri Balakrishna: విలక్షణమైన కాంబో మళ్లీ కలుస్తోందా?
  • Prabhas: మూడేళ్ళ తర్వాత ఒకే ఏడాది రెండు చిత్రాలు
  • Srinidhi Shetty: నిర్మాతల కోరికని మన్నించని అందాల నిధి
  • తెలుగు ఇండస్ట్రీలో చాలా మంచి ఉంది: Rakul Preet Singh
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes