
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణే (Deepika Padukone) మరోసారి తన ప్రొఫెషనలిజాన్ని చూపిస్తోంది. ఆమె రెండో బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధం అవుతోంది. ఇటీవలే ఆమె, ఆమె భర్త తమకు రెండో బిడ్డ కలగనుంది అని ప్రకటించారు. ఇప్పటికే వీరికి ఒక కూతురు ఉంది. తాజాగా దీపిక రెండోసారి ప్రెగ్నెంట్ అయింది.
ప్రెగ్నెన్సీ కారణంగా కొంతకాలం ఆమె విశ్రాంతి తీసుకుంటుందని అందరూ భావించారు. అయితే అందుకు విరుద్ధంగా, ఆమె ఇప్పటికే తన తదుపరి చిత్రాల షూటింగ్ షెడ్యూల్ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.ఆమె అల్లు అర్జున్ హీరోగా రూపొందుతోన్న “రాకా” (Raaka), షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న “కింగ్”(King) సినిమాల్లో నటిస్తోంది.
ఈ రెండు సినిమాలు ఒప్పుకున్నప్పుడు ఆమె ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చెయ్యలేదు. రెండో ప్రెగ్నన్సీ దీపిక, రణవీర్ ఇద్దరికీ సర్ప్రైస్ అని అంటున్నారు. అంటే ప్లాన్ చెయ్యకుండానే జరిగిపోయింది. అనుకోకుండా అలా జరిగినా ఆమె తన సినిమాల విషయంలో నిర్మాతలకు ఇబ్బంది లేకుండా ఉండేలా ప్లాన్ చేస్తోంది.
తన ప్రొఫెషనల్ కమిట్‌మెంట్స్‌పై ఎలాంటి ప్రభావం పడకుండా ఆమె తన షూటింగ్ లను వెంటనే ప్లాన్ చేసుకుందని చెబుతున్నారు.
దీపికా స్వయంగా తన ప్రెగ్నెన్సీ విషయాన్ని ఈ రెండు చిత్రాల మేకర్స్ కి తెలియజేసింది. అంతేకాకుండా, షూటింగ్ తేదీలను అందరికీ ఇబ్బంది కలగకుండా మేనేజ్ చేస్తానని హామీ ఇచ్చిందట.
