
వచ్చే నెల 4న ‘పెద్ది’ (Peddi) సినిమా థియేటర్లలోకి రానుంది. మరికొన్ని రోజుల్లో ట్రయిలర్ రిలీజ్ చేయబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం ట్రయిలర్ కట్ సిద్ధమైంది. మరి ‘పెద్ది’ ట్రయిలర్ లో ఆ సర్ ప్రైజ్ ఉంటుందా?
‘పెద్ది’లో 2 గెటప్స్ తో అలరించాడు చరణ్. ఒక గెటప్ లో బ్యాట్ పట్టిన విలేజ్ కుర్రాడిగా కనిపించాడు. మరో పాత్రలో పహిల్వాన్ లా మెప్పించాడు. ఈ రెండు గెటప్స్ కాకుండా మరో అదిరిపోయే షేడ్ కూడా సినిమాలో ఉంది. తాజాగా ఈ సినిమా యూనిట్ లో కొందరు ఆ విషయాన్ని బయటపెట్టారు.
ఇప్పటికే 2 లుక్స్ రిలీజ్ అవ్వడంతో, ఆ మూడో లుక్ ను ట్రయిలర్ లో చూపిస్తారని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. నిజంగా ట్రయిలర్ లో ఆ సర్ ప్రైజ్ ఉంటుందా? లేక అంతకంటే ముందే మూడో లుక్ ను ప్రత్యేకంగా రిలీజ్ చేస్తారా అనేది చూడాలి.
బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. శృతిహాసన్ ఇందులో స్పెషల్ సాంగ్ చేసింది.
