
పెద్ద సినిమాల నుంచి లీకులు, పుకార్లు రావడం కామన్. ‘విశ్వంభర’ (Vishwambhara) లాంటి సినిమాకు అలాంటివి మరీ ఎక్కువ. అయితే ఇది మాత్రం అస్సలు ఊహించనిది. ఈ సినిమా నుంచి కీరవాణి (MM Keeravani) డ్రాప్ అయ్యారంట.
ఆయన స్థానంలో మరో సంగీత దర్శకుడ్ని తీసుకున్నారట.
కీరవాణి కంపోజిషన్స్ తోనే ‘విశ్వంభర’ సినిమా మొదలైంది. ఒకప్పటి ఆచారాన్ని తిరిగి తెరపైకి తీసుకొస్తూ, కీరవాణి పాటల కంపోజిషన్స్ తో చిరంజీవి సినిమా పనులు మొదలుపెట్టారు. అలా ‘విశ్వంభర’ సినిమాను తన చేతుల మీదుగా ప్రారంభించి, ఇప్పుడు అదే ప్రాజెక్టు నుంచి అర్థాంతరంగా వైదొలిగారంట కీరవాణి.
ఆయన తప్పుకోవడానికి ఓ బలమైన రీజన్ ఉందంటున్నారు. లెక్కప్రకారం, ‘విశ్వంభర’ సినిమా పనులు ఎప్పుడో పూర్తవ్వాలి. కానీ ఆ సినిమా వర్క్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. మరీ ముఖ్యంగా రీ-రికార్డింగ్ బ్యాలెన్స్ ఉందంటున్నారు. అటు చూస్తే రాజమౌళి-మహేష్ కాంబినేషన్ లో వస్తున్న ‘వారణాసి’ వర్క్ రోజురోజుకు పెరుగుతోంది.
దీంతో తప్పనిసరి పరిస్థితుల మధ్య ‘విశ్వంభర’ నుంచి కీరవాణి డ్రాప్ అయినట్టు తెలుస్తోంది. ఆయన స్థానంలో రీ-రికార్డింగ్ పనుల కోసం గౌరహరిని తీసుకున్నారంట
