Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Sumanth Prabhas: వేరైటీ ఉండేలా ప్లాన్ చేస్తున్నా

TeluguCinema, May 5, 2026May 5, 2026

మేం ఫేమస్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సుమంత్ ప్రభాస్ (Sumanth Prabhas). అతని రెండో చిత్రం…. ‘గోదారి గట్టు’ (Godari Gattupaina) పైన. మే 8న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో సుమంత్ సినిమా విశేషాలు పంచుకున్నారు

ప్రమోషన్స్ చాలా ‘కూల్’ గా చేస్తున్నారు. రిలీజ్ కోసం మీరు ఎంత కూల్ గా ఉన్నారు?

నేను అయితే కూల్‌గా లేను (నవ్వుతూ). మూడేళ్ల తర్వాత నా నుంచి సినిమా వస్తుంది. తొలి సినిమా ‘మేము ఫేమస్’కి కూడా ఇంతే అగ్రెసివ్‌గా ప్రమోషన్స్ చేశాం. మూడేళ్ల తర్వాత సినిమా వస్తుండటంతో ఇది కూడా నాకు తొలి సినిమాలానే ఉంది. ఆడియన్స్ దగ్గరకు రీచ్ కావాలంటే ప్రమోషన్స్ వినూత్నంగా ఉండాలి.

‘మేము ఫేమస్’ యూత్ తెలంగాణ పల్లె కథ. ‘గోదారి గట్టుపైన’ గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో జరిగే సూపర్ క్యూట్ ఫిల్మ్. మంచి ఎమోషన్స్ ఉన్నాయి. జగపతి బాబు గారిది మెయిన్ క్యారెక్టర్. ఈ మధ్యకాలంలో ఆయన నుంచి ఇంటెన్స్, అగ్రెసివ్ క్యారెక్టర్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఇందులో మాత్రం ‘శుభలగ్నం’, ‘ఫ్యామిలీ సర్కస్’ సినిమాల్లా అందరూ రిలేట్ అయ్యే సూపర్ క్యూట్ క్యారెక్టర్‌లో కనిపిస్తారు. మా మధ్య జరిగే సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉంటాయి. గోదావరి యాసలో నటించడం మరింత ఎక్సైటింగ్‌గా ఉంది. సినిమాపై చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఇందులో చూపించిన లవ్, ఫాదర్-డాటర్ ఎమోషన్స్ అందరినీ ఆకట్టుకుంటాయి.

యాస విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?

నేను పుట్టి పెరిగింది తెలంగాణలో. గోదారి యాస కోసం దాదాపు నాలుగు నెలలు రిహార్సల్స్ చేశాను. అక్కడ పుట్టి పెరిగిన వారు విన్నప్పుడు ఖచ్చితంగా మనలాగే మాట్లాడుతున్నాడనే ఫీలింగ్ రావాలని ప్రయత్నించాను.

ఈ కథ అంగీకరించడానికి కారణం?

‘మేము ఫేమస్’ తర్వాత చాలా కథలు విన్నాను. కానీ మంచి కథ కోసం వెతుకుతుంటే కొంత ఒత్తిడి పెరిగేది. అప్పుడు కథని, ఎమోషన్స్ కొత్తగా చెప్పే ఫిల్మ్ మేకర్ కోసం వెతుకుతున్నప్పుడు సుభాష్ గారు కలిశారు. ఆయన ఇప్పటికే వంద షార్ట్ ఫిలిమ్స్ చేశారు. ఆయన షార్ట్ ఫిలిమ్స్ సినిమా స్టయిల్‌లోనే తీసేవారు. ఆయన చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. గోదారి నేపధ్య కథ అంటే నాకు ఛాలెంజ్‌గా అనిపించింది. నటనకు మంచి స్కోప్ దొరికింది.

మీ పేరు వెనుక కథ?

నా పేరు సుమంత్. అప్పట్లో ఫేస్‌బుక్‌లో ఫేవరేట్ హీరో పేరును యాడ్ చేసే ట్రెండ్ ఉండేది. అలా ‘సుమంత్ ప్రభాస్’ అని పెట్టుకున్నాను. అదే కంటిన్యూ అయింది.

ప్రమోషన్స్ వీడియోస్ చాలా క్రియేటివ్ గా వున్నాయి… ఐడియాలు ఎవరివి?

నావే. నేనే రాసి డైరెక్ట్ చేశాను. ఆడియన్స్ కి రీచ్ కావాలంటే కొత్తగా ప్రచారం చేయాలి. సినిమా సమ్మర్‌లో వస్తుంది కాబట్టి ‘కూల్’ కాన్సెప్ట్‌తో యాడ్స్ చేశాం. ఇవన్నీ మిలియన్ వ్యూస్‌లో వెళ్తున్నాయి. యాడ్స్‌లో ఉన్న కూల్‌నెస్ సినిమా చూసినప్పుడు కూడా ఫీల్ అవుతారు.

మీరు విన్న కథల్లో సూపర్ హిట్ అయినది?

‘రాజు వెడ్స్ రాంబాయి’ కథ సాయిలు అన్న చెప్పారు. నాకు చాలా నచ్చింది. కానీ అప్పటికే ‘మేము ఫేమస్’ తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో చేశాను. మళ్లీ అదే చేస్తే రిపీట్ ఫీలింగ్ వస్తుంది. ఇదే విషయం సాయిలు అన్నకి చెప్పాను. ఆ కథ అఖిల్ చేశాడు. అతనికి హెల్ప్ అయ్యింది. ఇండస్ట్రీకి కొత్త ట్యాలెంట్ వచ్చింది.

నెక్స్ట్ సినిమాలు?
ఒక సినిమా పూర్తయింది. త్వరలో వివరాలు తెలియజేస్తారు. ఇకపై గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నాను.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Aamir Khan wit Gauri Spratt
    Aamir Khan: జులై 5న మూడో పెళ్లి!
  • GV Prakash Kumar
    తెలుగులో బిజీ అవుతోన్న GV Prakash Kumar
  • Nani
    Nani: ఆ వార్త తప్పు అని వివరణ
  • Sushmita Sen
    Sushmita Sen తన డబ్బులు తీసుకోలేదంటున్న లలిత్
  • Gunasekhar
    హీరోల కోసం కథలు రాయొద్దు : Gunasekhar
  • Regina Cassandra adopts a horse
    Regina Cassandra: గుర్రాన్ని దత్తత తీసుకున్న సుందరి
  • Varun Tej
    Varun Tej: గాయం నుంచి కోలుకున్నాడు
  • Peddi
    Peddi: హిందీ ఓపెనింగ్ కీలకం!
  • Boxoffice: 2026 మే నెల మొత్తం ఖాళీ
  • Vijay Deverakonda: ఎందుకు ఇంత దూకుడు?
  • Avika Gor
    Avika Gor: ఈ ఫొటోల వెనక ఆంతర్యమేంటి?
  • Anasuya
    Anasuya: సూపర్ స్టార్ సినిమాలో ఈ భామ
  • Eesha Rebba
    Eesha Rebba: ఫొటోలేనా? పెళ్లి కబురు లేదా?
  • Prashanth Neel with NTR
    Prashanth Neel: డ్రాగన్ లో నా బాల్యం కనిపిస్తుంది
  • Namitha
    Namitha: బాధపడ్డాను కానీ తిరగబడ్డాను

Recent News

  • Aamir Khan: జులై 5న మూడో పెళ్లి!
  • Vijay Antony: జూన్ 19న ‘వంద దేవుళ్ళు’
  • ఊటీకి షిఫ్ట్ అయిన Rajinikanth
  • తెలుగులో బిజీ అవుతోన్న GV Prakash Kumar
  • Nani: ఆ వార్త తప్పు అని వివరణ
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes