
రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని ఇప్పటికే చాటుకున్నాడు అఖిల్ (Akhil Akkineni). తాజాగా ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని కూడా గుర్తుచేసుకున్నాడు. ఇప్పుడు మహేశ్ బాబు వంతు.
మహేష్ పేరు చెప్పగానే తనకు ‘పోకిరి’ (Pokiri) సినిమా గుర్తొస్తుందంటున్నాడు అఖిల్. తన జీవితంలో ఎక్కువసార్లు చూసిన సినిమాగా ‘పోకిరి’ని చెప్పుకొచ్చాడు. తనకు కూడా అలాంటి సినిమా చేయాలని ఉందంటూనే.. ‘ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు’ అనే డైలాగ్ కూడా చెప్పాడు. ‘పోకిరి’ సినిమా అంటే తనకు పిచ్చి అంటున్నాడు అఖిల్.
రీసెంట్ గా ‘లెనిన్’ సినిమాతో హిట్ కొట్టాడు అఖిల్. కెరీర్ లో తొలి సాలిడ్ సక్సెస్ అందుకున్న ఈ నటుడు, ఈ సినిమా నుంచే తన అసలైన ప్రయాణం మొదలైందని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా సక్సెస్ ను ఆస్వాదిస్తున్నట్టు పేర్కొన్న అఖిల్, మరో 2 వారాల పాటు లెనిన్ సినిమా ప్రమోషన్ ను కొనసాగిస్తానని క్లారిటీ ఇచ్చాడు.
సితార ఎంటర్ టైన్ మెంట్స్, అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ సినిమాలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సె హీరోయిన్ గా నటించింది. తమన్ సంగీతం అందించాడు.
