Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

నితిన్ నెక్ట్స్ సినిమా ఫ్రీ?

Admin, July 14, 2025March 4, 2026
Nithiin

వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు నితిన్. ఓవైపు అలా ఫ్లాపులొస్తున్నాయి. మరోవైపు ‘తమ్ముడు’ సినిమా బడ్జెట్ పెరిగిపోయింది. అందుకే రెమ్యూనరేషన్ విషయంలో బెట్టు చేయలేదు. “అంకుల్ మీకు ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఇవ్వండి” అంటూ దిల్ రాజుకు కబురు పెట్టాడు.

మొత్తానికి చాలా తక్కువ పారితోషికం తీసుకున్నాడు నితిన్. సినిమా హిట్టయితే అతడికి మరికొంత ముట్టేది. కానీ డిజాస్టర్ అవ్వడంతో, నితిన్ కు అదే ఫైనల్ పేమెంట్ గా మారింది.

ఇప్పుడు అసలు విషయానికొస్తే.. ఈ హీరో తన నెక్ట్స్ సినిమాకు ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోవడం లేదంట. తన తదుపరి చిత్రాన్ని కూడా దిల్ రాజు బ్యానర్ లోనే చేస్తున్నాడు నితిన్. దాని పేరు ‘ఎల్లమ్మ’. బలగం వేణు దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా కోసం తనకు డబ్బులు వద్దని చెప్పేశాడట నితిన్.

‘తమ్ముడు’ సినిమాకు విడుదలకు ముందు పాక్షికంగా పేమెంట్ తీసుకున్న ఈ హీరో, ‘ఎల్లమ్మ’ సినిమాకు మాత్రం సక్సెస్ అయిన తర్వాత పేమెంట్ తీసుకుంటానని, లేకపోతే ఒక్క పైసా కూడా వద్దని నిర్మాతకు చెప్పేశాడట. ప్రస్తుతానికి ఇది పుకారే అయినప్పటికీ, నిజమయ్యే అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే, నితిన్ కు ఇప్పుడు పారితోషికం కంటే సక్సెస్ అవసరం. 

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Dulquer Salmaan in Aakasam Lo Oka Tara
    Dulquer Salmaan: తెలుగు షూటింగ్ ల జోరు
  • Nidhhi Agerwal
    Nidhhi Agerwal: అలాంటివి పట్టించుకోను!
  • Eesha Rebba
    Eesha Rebba: స్పెషల్ కంటెంట్ ఇస్తుందంట
  • Allu Arjun: AA23 సినిమా ఆగిపోలేదు
  • Aamir Khan wit Gauri Spratt
    Aamir Khan: జులై 5న మూడో పెళ్లి!
  • GV Prakash Kumar
    తెలుగులో బిజీ అవుతోన్న GV Prakash Kumar
  • Nani
    Nani: ఆ వార్త తప్పు అని వివరణ
  • Sushmita Sen
    Sushmita Sen తన డబ్బులు తీసుకోలేదంటున్న లలిత్
  • Gunasekhar
    హీరోల కోసం కథలు రాయొద్దు : Gunasekhar
  • Regina Cassandra adopts a horse
    Regina Cassandra: గుర్రాన్ని దత్తత తీసుకున్న సుందరి
  • Varun Tej
    Varun Tej: గాయం నుంచి కోలుకున్నాడు
  • Peddi
    Peddi: హిందీ ఓపెనింగ్ కీలకం!
  • Boxoffice: 2026 మే నెల మొత్తం ఖాళీ
  • Vijay Deverakonda: ఎందుకు ఇంత దూకుడు?
  • Avika Gor
    Avika Gor: ఈ ఫొటోల వెనక ఆంతర్యమేంటి?

Recent News

  • Dulquer Salmaan: తెలుగు షూటింగ్ ల జోరు
  • Janhvi Kapoor: ‘పెద్ది’లో రెండున్నర నిమిషాలు తొలగింపు
  • Nidhhi Agerwal: అలాంటివి పట్టించుకోను!
  • Buchi Babu: జాన్వీ విషయంలో ట్రోలింగ్ పై స్పందన
  • Eesha Rebba: స్పెషల్ కంటెంట్ ఇస్తుందంట
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes