
సినిమాలకు 3 గంటల రన్ టైమ్ కామన్ అయిపోయింది. కంటెంట్ బాగుంటే, హీరో క్రేజ్ కూడా యాడ్ అయితే, నిడివి పట్టించుకోవడం లేదు మేకర్స్. థియేటర్లలో ప్రేక్షకుల్ని కూర్చోబెట్టగలమనే నమ్మకం ఉంటే చాలు, డ్యూరేషన్ గురించి పట్టించుకోవడం లేదు. ‘పెద్ది’ (Peddi)సినిమా మేకర్స్ కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారు.
తాజాగా ఈ సినిమా ఎడిట్ లాక్ చేశారు. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే, ఈ సినిమా నిడివి 3 గంటల 10 నిమిషాలు ఉందంట. గ్రాఫిక్ పార్ట్ కూడా యాడ్ చేస్తే మరో 5 నిమిషాలు పెరుగుతుందని సమాచారం.
దాదాపు ఇదే నిడివితో సెన్సార్ కు వెళ్లాలని మేకర్స్ భావిస్తున్నారు. మరోవైపు ‘పెద్ది’ (Peddi) సినిమా ట్రయిలర్ కూడా రెడీ అవుతోంది. 16 లేదా 17వ తేదీన ఈ ట్రయిలర్ ను లాంచ్ చేస్తారు. పూణె లేదా ఇండోర్ లో ట్రయిలర్ ను విడుదల చేసే అవకాశం ఉంది.
బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా సెట్స్ ను కొన్ని రోజుల కిందట చిరంజీవి విజిట్ చేశారు. దానికి సంబంధించిన వీడియోను కూడా మేకర్స్ తాజాగా విడుదల చేశారు. అటు ఓవర్సీస్ లో బుకింగ్స్ కూడా మొదలుపెట్టారు. ఇలా ‘పెద్ది’ సినిమా హంగామా ఓ రేంజ్ లో నడుస్తోంది.
