Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

హైదరాబాద్ నుంచి పరిశ్రమని మార్చలేం: పవన్ కళ్యాణ్

Admin, July 23, 2025March 4, 2026
Pawan Kalyan

హరి హర వీర మల్లు’తో పాటు ఆంధ్రప్రదేశ్ లో సినిమా ఇండస్ట్రీ పరిస్థితి సహా అనేక అంశాలపై పవన్ కళ్యాణ్ మీడియాతో ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు…

‘హరి హర వీర మల్లు’ తెలంగాణ వీరుడు పాపన్న కథేనా?

“హరిహర వీరమల్లు’ పాత్ర పూర్తిగా కల్పితం. దీన్ని రకరకాలుగా, రకరకాల కాలాలతో పోలుస్తూ ప్రచారం చేస్తున్నారు. సర్వాయి పాపన్న కథ అని, మరో వీరుడి కథగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ కథ కృష్ణా నదీ తీరంలో దొరికిన విలువైన కోహినూర్ వజ్రం కులీకుతుబ్ షాల దగ్గర నుంచి మొగలుల వద్దకు ఎలా చేరిందనే విషయాన్ని అంతర్లీనంగా చెబుతుంది.

సనాతన ధర్మం అనే కాన్సెప్టును దృష్టిలో పెట్టుకొని చిత్రీకరించిన చిత్రం అనుకోవచ్చా?

సొంత తమ్ముణ్ణి సైతం అత్యంత క్రూరంగా చంపిన ఔరంగజేబు వంటి క్రూరమైన మొగల్ చక్రవర్తి దాష్టీకాలను చూపించిన సినిమా. ధర్మం కోసం పోరాడిన యోధుడి సినిమా. హిందువులుగా బతకాలంటే రకరకాల పన్నులు కట్టాలనే అలనాటి అమానుష ఘటనలను స్పృశిస్తూ, తనకు అడ్డువచ్చిన రక్త సంబంధీకులనే చంపిన మొగల్ పాలకుడు ఔరంగజేబు స్వరూపాన్ని తెలిపే కథ.

ఉప ముఖ్యమంత్రిగా ఇటు సినిమాలు, అటు పాలన, మరోపక్క రాజకీయాలు చేయడం ఇబ్బందిగా అనిపించడం లేదా?

రాజకీయాలకే మొదటి ప్రాధాన్యం ఇస్తాను. దాని తర్వాత సినిమాలు. నాకు వచ్చింది సినిమాల్లో నటించడమే. నాకు అన్నం పెట్టింది, బతుకుదెరువు ఇచ్చింది సినిమాలే.

గతంలో ఎన్నడూ లేనట్లుగా ఈ సారి హరిహర వీరమల్లు కోసం ప్రత్యేకంగా ప్రమోషన్లకు దిగారు. ఈ మార్పుకు గల కారణం?

ఈ సినిమా చాలా ప్రత్యేకమైంది. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని చిత్ర నిర్మాణం సాగింది. ప్రకృతి విపత్తులు, మానవ విపత్తులు, రాజకీయ విపత్తులను తట్టుకొని నిలబడింది. నిర్మాతలు చాలా విషయాల్లో గుండె ధైర్యంతో నిలబడ్డారు. ఇంత ధైర్యంగా నిలబడిన నిర్మాతకు అండగా నిలబడటం నా కర్తవ్యంగా భావించాను. ప్రమోషన్లు చేయడం నా బాధ్యతగా భావించాను.

ఈ సినిమా చేస్తున్నపుడు అనేక ఇబ్బందులు పడినట్లున్నారు?

ఈ సినిమా నిర్మాణ సమయంలో రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాను. విశాఖలో నన్ను హోటల్ లో నిర్భందించడం వంటి కీలకమైన పరిణామాలు జరిగాయి. అలాగే నా సినిమా టిక్కెట్లను రూ.10, రూ.15లకు తగ్గించి గత పాలకులు ఇబ్బందులు పెట్టారు. సీమలో ఎవరికైనా పగలు ఉంటే చీని చెట్లను నరికి వారి ఆర్థిక మూలాలపై దెబ్బతీసే అలవాటు ఉన్న గత పాలకుల ఆలోచన విధానాలతో నాతో సినిమాలు చేసిన నిర్మాతలు చాలా నష్టపోయారు. నన్ను పూర్తిగా దెబ్బతీయడానికి నానా రకాల ప్రయత్నాలు జరిగాయి. ఇలా అన్ని విషయాలను అధిగమించి ఇప్పుడు ఈ చిత్రం బయటకు రావడం ఆనందంగా ఉంది.

మీరు డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొదటి చిత్రం ఇది. దీన్ని మీ తోటి సహచరులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులకు చూపిస్తారా?

నాకు ఇప్పటి వరకు ఈ ఆలోచన రాలేదు. మంచి సూచన చేశారు. కచ్చితంగా నా సహచరులైన ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యేకంగా షో వేసే ఏర్పాటు చేస్తాను.

మీరు డైరెక్ట్ చేసిన ‘జానీ’ సినిమా నిరాశ మిగిల్చింది. మళ్లీ ఇప్పుడు ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో చివరి సీన్లు మీరే తీసినట్లు చెబుతున్నారు? అప్పటికీ ఇప్పటికీ మీ అనుభవం ఏంటీ?

“జానీ” సినిమా ఫలితం జీవితంలో మరింత రాటుదేలేలా నన్ను మార్చిందని చెప్పొచ్చు. సినిమా ఫ్లాప్ టాక్ వచ్చిన వెంటనే నేను బయ్యర్లు, ఫైనాన్సియర్స్ అందరినీ ఇంటికి పిలిచి సెటిల్ చేశాను. చాలా రోజులపాటు నిశ్శబ్దంగా ఉండిపోయాను. ఆ రోజు జానీ చిత్ర ఫలితం నాకు రాజకీయాల్లో అపజయం వచ్చినపుడు దాన్ని తట్టుకొని ఎలా ముందుకు సాగాలో నేర్పించింది. జీవితంలో వచ్చే అపజయాలను దాటితేనే.. నువ్వు లక్ష్యాన్ని చేరుకోగలవు అనేది జానీ చిత్రంతో నాకు అవగతమైంది. తర్వాత రాజకీయ జీవితాల్లో స్ఫూర్తి పాఠం అయింది.

హరిహర వీరమల్లు చిత్రం పార్ట్ 2 అవకాశం ఉందా?

హరిహర వీరమల్లు పార్ట్ – 2 కూడా 20 శాతం చిత్రీకరణ పూర్తయింది.

రాజకీయాల్లో ఉంటూనే ఇకపై చిత్రాలను చేస్తారా?

భగవంతుడి ఆశీస్సులు ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. భవిష్యత్తు గురించి ఇప్పుడే మనం అంచనా వేయలేం కదా.

హైదరాబాద్ నుంచి పరిశ్రమని మార్చాలంటారా?

పరిశ్రమని ఇక్కడికి షిఫ్ట్ చెయ్యడం జరగదు. హైదరాబాద్ మాదిరిగా ఆంధ్రప్రదేశ్ లోనూ తెలుగు చిత్ర పరిశ్రమ పెరగాల్సిన అవసరం ఉంది. దీనికి తగిన వసతులు, సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తాం. ముఖ్యంగా ఇక్కడ ఫిల్మ్ స్కూల్స్ పెరిగితే బాగుంటుంది. దీనివల్ల చిత్ర నిర్మాణాలు పెరుగుతాయి. అవకాశాలు విస్తృతం అవుతాయి.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Varanasi
    Varanasi: రాజమౌళి మూవీ ఏప్రిల్ 7 నుంచి వాయిదా పడుతుందా?
  • Srinidhi shetty
    Srinidhi Shetty: నిర్మాతల కోరికని మన్నించని అందాల నిధి
  • Sobhita
    అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita
  • Pooja Hegde
    Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!
  • Samantha
    తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: కొత్తగా కథలు వింటున్నాను
  • Naga Durga
    Naga Durga: ఎన్నో కండీషన్లు, అయినా అవకాశాలు!
  • Prithviraj Sukumaran
    Prithviraj Sukumaran: హీరో కాలులో 3 స్క్రూలు!
  • Preity Mukhundhan
    Preity Mukhundhan: ఈ ఆరు ‘ప్రీతి’పాత్రమైనవి
  • Venkatesh
    Venkatesh: రెండు హిట్లతో పారితోషికం భారీగా పెంపు
  • Nani
    The Paradise: నాని తెగ వర్రీ అవుతున్నారట
  • Sai Pallavi
    తెలిసి కూడా ముద్దు అడుగుతుంటారు: Sai Pallavi
  • Nidhhi Agerwal
    Nidhhi Agerwal: డబ్బున్న మగాడు కోసం వెదుకుతున్నాను!
  • Kiara Advani and Yash in Toxic
    Toxic: ఆ పుకార్లు నిజం కాదని ప్రూవ్ చేసింది కియరా
  • Krithi Shetty
    Krithi Shetty: నన్ను గ్లామర్ కి వాడుకొండి అని చెప్తోందా!

Recent News

  • Varanasi: రాజమౌళి మూవీ ఏప్రిల్ 7 నుంచి వాయిదా పడుతుందా?
  • Nandamuri Balakrishna: విలక్షణమైన కాంబో మళ్లీ కలుస్తోందా?
  • Prabhas: మూడేళ్ళ తర్వాత ఒకే ఏడాది రెండు చిత్రాలు
  • Srinidhi Shetty: నిర్మాతల కోరికని మన్నించని అందాల నిధి
  • తెలుగు ఇండస్ట్రీలో చాలా మంచి ఉంది: Rakul Preet Singh
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes