Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Sree Vishnu: ‘మన చుట్టూ ఉండే కధలే చేస్తున్నాను’

TeluguCinema, February 26, 2026February 26, 2026
Sree Vishnu

శ్రీ విష్ణు (Sree Vishnu) కొత్త చిత్రం.. ‘విష్ణు విన్యాసం’. ఫిబ్రవరి 27న విడుదల కానున్న సందర్భంగా హీరో శ్రీ విష్ణు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

విష్ణు విన్యాసంలో హైలెట్స్ ఏంటి?

డైరెక్టర్ మారుతి రావు చెప్పిన కథ చాలా నచ్చింది. అందరూ రిలేట్ అయ్యే కథ, చాలా మంచి క్యారెక్టర్. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా నవ్వుకోవచ్చు. కథ విన్న వెంటనే మొదలుపెట్టాం. హీరోయిన్ డామినేషన్ సినిమాలో నా క్యారెక్టర్ కి ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఆడియన్స్ మాత్రం చాలా బాగా కనెక్ట్ అవుతారు. అందునుంచి చాలా మంచి ఫన్ జనరేట్ అవుతుంది. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ కాస్త అనుమానస్పదంగా ఉంటుంది.

ఫస్ట్ హాఫ్ యూత్ కి, సెకండ్ హాఫ్ యూత్ తో పాటు ఫ్యామిలీ కూడా కనెక్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్యామిలీ కామెడీ ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇందులో నేను పోషించిన పాత్ర నాకు కొత్త. ఈ క్యారెక్టర్ కి కొన్ని రూల్స్ ఉంటాయి. చాలా నమ్మకాలు ని ఫాలో అవుతుంటాడు. డైరెక్టర్ మారుతి సినిమాని చాలా బాగా హ్యాండిల్ చేశాడు. చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్.

మీ మార్క్ డైలాగ్స్ ఇందులో ఉంటాయా?

అన్నీ ఉంటాయి. కథ, క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా సరదాగా అనిపిస్తాయి. ఇందులో ఇంకొంచెం డిఫరెంట్ టైమింగ్ చూస్తారు. ఇందులో లెక్చరర్ గా కనిపిస్తాను. అక్కడ కూడా తను నెంబర్లను ఫాలో అవుతాడు. ఇందులో వీరి వీరి గుమ్మడి పండు అనే ఒక సీక్వెన్స్ ఉంది. ఆ ఎపిసోడ్ కి థియేటర్ మొత్తం నవ్వులతో బ్లాస్ట్ అవుతుంది.

నిజ జీవితంలో మీరు గ్రహాలని, జాతకాలని నమ్ముతారా?

అన్ని ఫాలో అవ్వను, కానీ మనం చిన్నప్పటి నుంచి అందరితోపాటు అలవాటు చేసుకున్న కొన్నిటిని ఫాలో అవుతాను. పర్సనల్ గా నాకైతే ఫలానా టైము ఫలానా నెంబర్లు అనే నమ్మకాలు లేవు.

మీ సినిమాలకు ఓటిటి డిల్స్ తొందరగా జరగడం ఎలా అనిపిస్తోంది?

ఈ సినిమాతో పాటు మృత్యుంజయ్, మరో మూడు సినిమాల డీల్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. రిలీజ్ కి ముందే ప్రొడ్యూసర్స్ హ్యాపీగా ఉండడం చాలా ఆనందాన్నిస్తుంది. నేనెప్పుడూ కూడా ప్రొడ్యూసర్స్ పెట్టే డబ్బులు వెనక్కి వస్తే చాలు అనే ఆలోచనతోనే ఉంటాను. ఇప్పుడు అలా అన్ని సినిమాలు జరగడం హ్యాపీగా ఉంది.

రెండు సినిమాలు ఒకేసారి వచ్చే పరిస్థితి వచ్చింది. కానీ మీ వల్లే ఇది సోలో రిలీజ్ సాధ్యపడిందని నిర్మాతలు చెప్పారు?

ఇది కొంచెం సున్నితమైన అంశం. ఎలా బ్యాలెన్స్ చేయాలా అనేదానిమీద నేను కూడా ఒక రెండు మూడు రోజులు స్ట్రగుల్ అయ్యాను. ప్రొడ్యూసర్స్ కూడా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు అందరూ అనుకుంటున్నట్టుగా ఓటీటీ ఒక కారణం అయితే ఇంకో కారణం కూడా ఉంది. అది ఇప్పుడే చెప్పకూడదు. రిలీజ్ తర్వాత సమయం వచ్చినప్పుడు చెప్తాను.

కొత్త సినిమాలు గురించి?

“కామ్రేడ్ కళ్యాణ్” 80% షూటింగ్ పూర్తయింది. చాలా కొత్తగా ఉంటుంది. అలాగే రామ్ అబ్బరాజుతో ఓ సినిమా త్వరలో స్టార్ట్ కాబోతుంది. అలాగే సితార సంస్థలో సన్నీ అనే ఒక కొత్త దర్శకుడు తో ఓ సినిమా చేస్తున్నాను. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. “సింగిల్” సినిమాకి సీక్వెల్ కూడా వస్తుంది.

మీరు చాలా ఫాస్ట్ గా సినిమాలు చేస్తున్నారు. అదెలా సాధ్యం అవుతోంది?

నేను అన్ని కూడా మన చుట్టూ ఉండే కధలే చేస్తున్నాను. అని మనకు తెలిసిన పాత్రలే. మిడిల్ క్లాస్ స్టోరీ సెట్ అప్. ఇలాంటి సినిమాలు కి సంవత్సరాలు పట్టదు. సింపుల్ గానే ఒక 60,70 రోజుల్లో చేసుకోవచ్చు. అందుకే ఫాస్ట్ గా అవుతున్నాయని భావిస్తున్నాను. నిజానికి కామెడీ చేయడం, నవ్వించడం కష్టం. అయితే మాక్సిమం సిచువేషనల్ కామెడీస్ చేస్తున్నాం కాబట్టి వర్కౌట్ అవుతున్నాయి.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ఏ అవకాశాన్నీ వదులుకోవట్లేదుగా!
  • Samantha
    చాలా జీవితాన్ని చూశానంటున్న Samantha
  • Ustaad Bhagat Singh, The Raja Saab and Peddi
    North America: ‘పెద్ద'(ద్ది) చిత్రాలతో డిస్ట్రిబ్యూటర్లకు షాకులే
  • తమిళ దర్శకులను తెగ పొగిడిన Malavika Mohanan
  • Chiranjeevi: మొదట దేవి కథ మెగా ఖాతాలోనే
  • Nayanthara
    Nayanthara: ‘కాంచన 4’లో లేడి సూపర్ స్టార్ నటిస్తుందా!
  • Pooja Hegde: క్రేజ్ వేరు, సక్సెస్ వేరు
  • Aishwarya Rajesh
    Aishwarya Rajesh: స్టయిలింగ్ పై పడిన ఫోకస్!
  • Allu Arjun: విలువైన సెలబ్రిటీల లిస్ట్ లో ఒక్కడు
  • Katrina Kaif
    Katrina Kaif: రీఎంట్రీ వార్తలు తప్పు!
  • Preity Mukhundhan
    Preity Mukhundhan: త్వరలోనే 5 సినిమాలు
  • Bharathiraja
    Bharathiraja పేరు తొలిసారి విన్నప్పుడు
  • Nayanthara and her husband Vignesh Shivan in Venice
    Nayanthara: వెనిస్ లో వెడ్డింగ్ డే
  • Thaman
    దేవిశ్రీ ప్రసాద్ పై Thaman పంచ్!
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ‘నాకు సౌత్ సినిమానే గొప్ప’

Recent News

  • Nani: ఆ సినిమా ఆగిపోలేదని క్లారిటీ వచ్చింది
  • Preity Mukhundhan: శర్వానంద్ సరసన ‘బ్లాస్ట్’ భామ
  • త్వరలో పెళ్లి కావాలని కోరుకుంటున్న Sreemukhi
  • ఇంతకీ ఏ పండుగ చేస్కోవాలి బాబూ Lenin!
  • Kajal Aggarwal: ఏ అవకాశాన్నీ వదులుకోవట్లేదుగా!
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes