
కీర్తి సురేష్ (Keerthy Suresh)కి ఒక్కసారిగా క్రేజ్ పెరిగినట్లు కనిపిస్తోంది. రెండేళ్ల క్రితం (December 12, 2024) కీర్తి సురేష్ తన బాయ్ ఫ్రెండ్ ఆంటోనిని పెళ్లాడింది. పెళ్లి తర్వాత ఒక ఏడాది పాటు ఎలాంటి ఆఫర్లు రాలేదు. కానీ ఆ తర్వాత వరుసగా అవకాశాలు మొదలయ్యాయి.
ముఖ్యంగా 2026లో ఆమెకి ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి అని చెప్పాలి.
ప్రస్తుతం ఈ చెన్నై బ్యూటీ వెంకటేష్ సరసన దర్శకుడు అనిల్ రావిపూడి తీస్తున్న మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా సంక్రాంతి 2027కి విడుదల కానుంది. ఆ తర్వాత రెండు నెలలకు “రౌడీ జనార్ధన” (Rowdy Janardhana) విడుదల అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. విజయ్ దేవరకొండ సరసన ఆమె నటిస్తున్న మొదటి చిత్రం ఇది.
తాజాగా నాని నటిస్తోన్న ‘ది ప్యారడైజ్’ చిత్రంలో కూడా ఆఫర్ దక్కింది. ఈ సినిమాలో ఆమె ప్రత్యేక గీతంలో కనిపిస్తుంది. అంటే ప్రస్తుతం కీర్తి సురేష్ ఖాతాలో మూడు భారీ చిత్రాలు ఉన్నాయి. అన్నీ తెలుగు చిత్రాలే.
హిందీలో కూడా అడుగుపెట్టింది కీర్తి సురేష్. కానీ అక్కడ సక్సెస్ కాలేదు. తమిళంలో ఆఫర్లు చాలా తక్కువ. దాంతో ఆమె ఇప్పుడు ఎక్కువగా తెలుగుపైనే ఫోకస్ పెట్టింది.
తల్లిగా మారేలోపు ఎక్కువ సినిమాలు చెయ్యాలని టార్గెట్ పెట్టుకుంది. దానికి తగ్గట్లే అన్ని ఆఫర్లను ఓకె చేస్తోంది.
