
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ఇప్పటికే హీరోగా పది సినిమాల్లో నటించాడు. మరో రెండు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. హీరోగా నటిస్తూనే రచయితగా, నిర్మాతగా తనలోని మరో కోణాన్ని చూపిస్తున్నాడు. తాజాగా సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న తాజా చిత్రం… “తిమ్మరాజుపల్లి టీవీ” (Thimmaraju Palli TV). తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. “తిమ్మరాజుపల్లి టీవీ” చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే చిత్రం త్వరలోనే విడుదల కానుంది.
ఈ రోజు ఈ సినిమా నుంచి ‘ఊరు సాంగ్’ రిలీజ్ చేశారు.
వంశీకాంత్ రేఖన కంపోజ్ చేసిన ఈ పాటకు సనరే సాహిత్యాన్ని అందించారు. మమత రమేష్ పాడారు. పల్లెటూరిలో జరిగే శివరాత్రి జాతర సందడిని, ఆ పండక్కి ఊరు ప్రజలంతా సన్నద్ధమయ్యే తీరును వర్ణిస్తూ ఆకట్టుకునేలా సాగుతుందీ పాట.
