
ప్రియాంక చోప్రా (Priyanka Chopra)కి హాలీవుడ్ లో పెద్ద హిట్స్ లేవు. కానీ ఆమెకి గ్లోబల్ స్టార్ అన్న ఇమేజ్ ఉంది. అమెరికాలో ఆమెకి ఉన్న ఫాలోయింగ్ వేరు. ప్రతి సంవత్సరం ఏదో ఒక్క పెద్ద వేడుకలో ఆమె కనిపిస్తూ ఉంటుంది. ఫ్యాషన్ ఈవెంట్స్ కి తప్పనిసరిగా హాజరు అవుతుంటుంది. ఇండియా తరఫున గ్లోబల్ ఫేస్ గా ఆమె ఉంది.
తాజాగా ఆమె ఆస్కార్ అవార్డు కార్యక్రమంలో ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అవార్డు ప్రెసెంటేషన్ కి హోస్ట్ గా దర్శనమిచ్చింది. అలా 2026 ఆస్కార్ అవార్డు (Oscars 2026) కార్యక్రమంలో కనిపించింది.
ALSO CHECK: Priyanka Chopra stuns in white gown at Oscars 2026
ఆమెని రాజమౌళి తన సినిమాలో మెయిన్ హీరోయిన్ గా తీసుకున్నది ఎందుకో ఇప్పుడు అందరికీ అర్థం అవుతోంది.
ప్రియాంక ఇప్పటికీ తన అన్ని ఇంటర్వ్యూలలో రాజమౌళి తీస్తున్న “వారణాసి” గురించి తెగ మాట్లాడుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల అవుతుంది. విడుదలకు ఏడాది ముందునుంచే ఆమె ప్రమోట్ చేస్తోంది. వేర్వేరు ఈవెంట్ లలో, ఇంటర్వ్యూలలో ఆమె తన సినిమా గురించి ఇంత మాట్లాడుతోందంటే… తీరా విడుదల టైంలో అమెరికాలో ఆమె ఎలా ప్రమోట్ చేస్తుందో, ఆమె వల్ల సినిమాకి ఎంత ప్రచారం దక్కుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఈ సినిమాతో అమెరికా ప్రేక్షకులలో తన సినిమాలకు ప్రత్యేక మార్కెట్ తెచ్చుకోవాలని రాజమౌళి ప్లాన్ వేశారు. ఇప్పటివరకు బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ వంటి సినిమాలను అమెరికాలో చూసిన ప్రేక్షకుల్లో 95 శాతం భారతీయులే. “ఆర్ ఆర్ ఆర్” సినిమాని హాలీవుడ్ మేకర్స్, నటులు చాలామందే చూసినా సాధారణ అమెరికా ప్రేక్షకులు పెద్దగా చూడలేదు. “వారణాసి”తో అది సాధించాలని రాజమౌళి టార్గెట్ గా పెట్టుకున్నారు. అందుకే ప్రియాంక చోప్రా వల్ల ఈ సినిమాకి బోలెడు లాభం.
