
మహా నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) మధ్య మంచి అనుబంధం, స్నేహం ఉంది. అమితాబ్ కి పెద్ద అభిమాని రామ్ గోపాల్ వర్మ. బిగ్ బీని కొత్తగా చూపించాలని “సర్కార్” సినిమా తీశారు 2005లో. ఆ సినిమా భారీ విజయం సాధించింది. ఒక ఐకానిక్ ఫిలింగా నిలిచింది.
ఆ తర్వాత “సర్కార్” సిరీస్ లోనే మరో రెండు సినిమాలు వచ్చాయి వీరి కాంబినేషన్లో. ఇప్పుడు నాలుగో చిత్రం రానుంది. “సర్కార్ 4” (Sarkar 4) షూటింగ్ వచ్చే నెలలో మొదలు కానుంది.
ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ తెలుగు సినిమా కల్కి 2 షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ షూటింగ్ పూర్తి అయిన తర్వాత రామ్ గోపాల్ వర్మ తీసే “సర్కార్ 4″లో పాల్గొంటారట. ఇప్పటివరకు అమితాబ్, వర్మ కాంబినేషన్ లో ఎనిమిది సినిమాలు వచ్చాయి. కొన్ని సినిమాల్లో అతిథి పాత్రల్లో కూడా కనిపించారు అమితాబ్.
సర్కార్ సిరీస్ లో మూడు సినిమాలు కాకుండా వర్మ తీసిన రన్, డిపార్ట్మెంట్, డర్న జరూర్ హై, నిశ్శబ్ద్, రామ్ గోపాల్ వర్మ కి ఆగ్ వంటి సినిమాల్లో అమితాబ్ నటించారు.
