
విశ్వక్ సేన్ నటించిన “ఫంకీ” (Funky) సినిమా గత నెల థియేటర్లో విడుదలైంది. “జాతిరత్నాలు” తీసిన అనుదీప్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి అప్పుడే దారుణమైన కామెంట్స్ వచ్చాయి. వన్ లైన్ డైలాగ్ లతో నవ్వించే ప్రయత్నం బెడిసికొట్టింది. దర్శకుడు అనుదీప్ చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు.
ఇక హీరో విశ్వక్ సేన్ మరో కామెంట్ చేశాడు. సినిమా ఫ్లాప్ అయినా కూడా తన దృష్టిలో అది సక్సెసఫుల్ మూవీ అని ప్రకటించి మరింత నవ్వుల పాలు అయ్యాడు.
ఇప్పుడు ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ కామెంట్లు, విమర్శలు ఎదుర్కొంటోంది ఈ మూవీ. విశ్వక్ సేన్ చేసిన ఆ కామెంట్ ని ఇంకా ఎక్కువ ట్రోల్ చేస్తున్నారు.
కథ లేకుండా సినిమాలు తీసినా ఆడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ అన్నిసార్లు అది వర్కువట్ కాదు. అందుకే, అనుదీప్ ఈ సారి స్ట్రాంగ్ స్క్రిప్ట్ లేకుండా కేవలం నవ్వురాని జోకులతో, డైలాగ్ లతో నడిపించాలని ప్రయత్నం చేసి దొరికిపోయాడు.
