Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Meenakshi Chaudhary: ఆ నంబర్ నాది కాదు

TeluguCinema, June 13, 2026June 13, 2026
Meenakshi Chaudhary

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీలు అభిమానులకు ఎంత దగ్గరవుతున్నారో, అదే స్థాయిలో కేటుగాళ్లు కూడా రెచ్చిపోతున్నారు. స్టార్ హీరోలు, హీరోయిన్ల పేర్లతో నకిలీ అకౌంట్లు సృష్టించి అమాయకులను బురిడీ కొట్టించడం సైబర్ నేరగాళ్లకు నిత్యకృత్యంగా మారిపోయింది. తాజాగా టాలీవుడ్ క్రేజీ బ్యూటీ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) కూడా ఈ తరహా మోసగాళ్ల బారిన పడింది.

ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు మీనాక్షి పేరుతో ఒక ఫేక్ వాట్సాప్ నంబర్‌ క్రియేట్ చేశారు. పలువురికి మెసేజ్‌లు పంపుతూ డబ్బులు వసూలు చేసేందుకు స్కెచ్ వేశారు. ఈ విషయం కాస్తా ఈ ముద్దుగుమ్మ దృష్టికి వెళ్లడంతో ఆమె తక్షణమే స్పందించింది.

తన పేరు వాడుకుని జరుగుతున్న ఈ మోసాన్ని గమనించిన మీనాక్షి, అభిమానులు ఎవరూ ఆ వలలో పడకూడదని భావించి వెంటనే అప్రమత్తం చేసింది. ఈ విషయమై తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటన విడుదల చేసింది మీనాక్షి.

“నా పేరుతో కొందరు నకిలీ నంబర్‌ను వాడుతూ మోసాలకు తెరలేపారు. ముఖ్యంగా 76048 91175 అనే నంబర్ నుండి మీకు ఎలాంటి కాల్స్ గానీ, మెసేజ్‌లు గానీ వస్తే అస్సలు నమ్మకండి, స్పందించకండి. ఆ నంబర్‌కు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ ఆ నంబర్ నుండి మీకు ఏవైనా సందేశాలు వస్తే వెంటనే నా దృష్టికి తీసుకురండి.” అంటూ నెటిజన్లను, ఫ్యాన్స్‌ను అప్రమత్తం చేసింది. 

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Nani
    The Paradise: నాని తెగ వర్రీ అవుతున్నారట
  • Sai Pallavi
    తెలిసి కూడా ముద్దు అడుగుతుంటారు: Sai Pallavi
  • Nidhhi Agerwal
    Nidhhi Agerwal: డబ్బున్న మగాడు కోసం వెదుకుతున్నాను!
  • Kiara Advani and Yash in Toxic
    Toxic: ఆ పుకార్లు నిజం కాదని ప్రూవ్ చేసింది కియరా
  • Krithi Shetty
    Krithi Shetty: నన్ను గ్లామర్ కి వాడుకొండి అని చెప్తోందా!
  • Nagabandham, Akhanda 2 and Hari Hara Veera Mallu,
    Sanathana ట్రెండ్ తెలుగు సినిమాలకు కలిసి రావడం లేదా?
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ఇన్ స్టాలో అందాల ఆరబోత, సినిమాల్లో నో గ్లామర్!
  • Aishwarya Rajesh
    ఆ మేజిక్ కోసం చూస్తానంటున్న Aishwarya Rajesh
  • Sreeleela
    అలాంటి వాడు దొరికితే రెడీ అంటోన్న Sreeleela
  • Shriya
    Shriya: హీరోయిన్ పై కామెంట్ చేస్తే థ్యాంక్స్ చెప్పిన భర్త
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: తొలి సినిమా నుంచి ఆ కథలే భాగ్యం
  • Malavika Mohanan
    మాల్దీవుల్లో Malavika Mohanan అందాల ఆరబోత
  • Neha Dhupia
    Neha Dhupia: ‘వెనకనుంచి తీయొద్దురా బాబు’, పాపరాజీపై మండిపాటు
  • Kayadu Lohar
    Kayadu Lohar: రాయితో బుర్ర పగలగొట్టిన హీరోయిన్
  • Pooja Hegde
    Pooja Hegde: పూజ పేరు ఇంకో భారీ ప్రాజెక్టులో!

Recent News

  • The Paradise: నాని తెగ వర్రీ అవుతున్నారట
  • Savithri Classics: సావిత్రి ఒక అద్భుతం: జయప్రద
  • Oh Sukumari trailer: కరెంట్ షాక్ కాన్సెప్ట్‌తో వినోదం
  • తెలిసి కూడా ముద్దు అడుగుతుంటారు: Sai Pallavi
  • పుచ్చకాయ తినడం మానేసింది: Kajal Aggarwal
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes