
కొన్నాళ్ల నుంచి ‘‘మేము‘కాప్’లం’’ (Memu Coplam) సిరీస్ టైటిల్ దగ్గర నుంచి ప్రతీ విషయంలోనూ క్యూరియాసిటీని పెంచుతోంది. మే 22 నుంచి ఈ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌పై మరింత ఆసక్తిని పెంచేలా ‘‘మేము‘కాప్’లం’’ ట్రైలర్‌ను విడుదల చేశారు..
ట్రైలర్‌ను గమనిస్తే.. మహదేవపట్నం అనే ప్రాంతంలో కథ మొదలవుతుంది. అయ్యగారు వారసుడొచ్చాడండోయ్.. అని పాలేరు అని అరిచి మరి చెబుతాడు. అప్పుడు గజపతిరాజు పాత్రలో నటించిన నాగబాబు ఆనందపడతాడు. సలార్‌రాజు తన వారసుడు అని ప్రకటిస్తాడు. అయితే అనుకోకుండా ఆ సలార్ రాజు కనిపించకుండా పోతాడు. దీంతో ఊరంతా గందరగోళంలో పడుతుంది. ఇంతకీ సలార్ రాజు ఎవరో కాదు.. కోళ్ల పందెల్లో పాల్గొనాల్సిన కోడిపుంజు. దీన్ని వెతకటానికి ఇద్దరు పోలీసులు(గెటప్ శీను, రవితేజ నన్నిమల) ఊళ్లోకి వస్తారు.
సలార్ రాజు కనిపించకపోవటం వల్ల..ఎవరికి లాభం అనే కోణంలో పోలీసులు అన్వేషిస్తుంటారు. అయితే వారికి ఊళ్లో మరో సమస్య కనిపిస్తుంది. దీంతో వాళ్లు కొత్త సమస్య నుంచి ఊరిని బయటపడేయటానికి ప్రయత్నిస్తారు. ఇంతకీ మహదేవపట్నంలోని ప్రధాన సమస్య ఏంటి? పోలీసులు దాన్ని ఎలా పరిష్కరిస్తారు. అసలు ఇంతకీ సలార్ రాజు దొరికాడా? లేదా? అనే విషయాలు తెలియాలంటే మే 22న జీ5లో స్ట్రీమింగ్ కానున్న ‘‘మేము‘కాప్’లం’’ వెబ్ సిరీస్ చూడాల్సిందేనంటున్నారు మేకర్స్.
నాగబాబు ప్రధాన పాత్రలో నటించిన ‘‘మేము ‘కాప్’లం’’ సిరీస్‌ను రా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై బి.వి.ఎస్. రవి, కౌముది కె నేమాని నిర్మాతలుగా ప్రదీప్ మద్దాలి క్రియేటివ్‌తో కలిసి రూపొందింది.
‘వికటకవి’ డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు. శోభన్ చిట్టుప్రోలు కథను అందించారు. గెటప్ శ్రీను, రవితేజ నన్నిమల కీలక పాత్రల్లో నటించారు. కామెడీ, మిస్టరీ కలయికగా అందరినీ ఆకట్టుకునే కథాంశంతో..గ్రామీణ నేపథ్యంలో, అక్కడి రోజువారీ జీవితం, స్థానిక రాజకీయాలు, ఊహించని గందరగోళం..ఇలా అన్నీ కలగలిపిన ఆసక్తికరమైన కథతో ఈ సిరీస్ తెరకెక్కింది.
