Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

రామ్ చరణ్ బంగారం: పవన్ కళ్యాణ్

Admin, January 4, 2025
Pawan Kalyan and Ram Charan

“గేమ్ చేంజర్” చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని శనివారం రాజమండ్రిలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆంధ్రపదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచ్చేశారు. తన అన్నయ్య కొడుకు రామ్ చరణ్ పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. ఎంత ఎదిగినా ఒదిగే వాడని, తమ ఇంటి బంగారం అని మెచ్చుకున్నారు.

పవన్ కళ్యాణ్ మాటల్లో…

సినిమా పరిశ్రమకు మూలాలైన రఘుపతి వెంకయ్య నాయుడు, దాదా సాహెబ్ ఫాల్కే, రాజ్ కపూర్, సత్య జిత్ రేని మర్చిపోలేం. తెలుగు ఖ్యాతిని ఎగరేసిన నాగిరెడ్డి గారిని, బీఎన్ రెడ్డి గారిని, రామబ్రహ్మం గారు, తెలుగు జాతి కీర్తి పెంచిన ఎన్టీ రామారావు గారిని, ఏఎన్నార్ గారిని తలుచుకుంటాం. పవన్ కళ్యాణ్ ఉన్నా, రామ్ చరణ్ ఉన్నా… దానికి కారణం చిరంజీవి గారు. మీరు కళ్యాణ్ బాబు అని అరిచినా, ఓజీ అని అరిచినా, డిప్యూటీ సీఎం అని అరిచినా దానికి చిరంజీవి గారే ఆద్యులు.

సీఎం చంద్రబాబు గారి సహకారం, మద్దతు వల్లే ఈ రోజు ఇక్కడ ఇలాంటి ఈవెంట్‌ను నిర్వహించుకోగల్గుతున్నాం. హోం మినిస్టర్ అనిత గారికి, డీజీపీ గారికి, జిల్లా యంత్రాంగానికి థాంక్స్.

శంకర్ గారు చేసిన జెంటిల్మెన్ సినిమాను చెన్నైలో చూశాను. ప్రేమికుడు సినిమాకు అమ్మమ్మతో వెళ్లాను. సామాజిక సందేశాన్ని అందిస్తూ శంకర్ గారు సినిమాలు తీస్తుంటారు. ఈ రోజు రాజమౌళి గారు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు గ్లోబల్ స్థాయికి వెళ్లారు. దానికి కొంత మంది సౌత్ దర్శకులు కారణం. అందులో శంకర్ గారు ఒకరు. తమిళంలో శంకర్ గారు సినిమాలు తీసి తెలుగు వారిని మెప్పించారు. ఆయన తెలుగులో సినిమా చేస్తే బాగుంటుందని ఎప్పటి నుంచో అనుకున్నాను.

ఇక దిల్ రాజు గారు నా ‘తొలిప్రేమ’ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశారు. నేను బాగా కష్టాల్లో ఉన్నప్పుడు ‘వకీల్ సాబ్’ సినిమా ఇచ్చారు దిల్ రాజు. ఆయన ఇచ్చిన డబ్బులే జనసేనకు ఇంధనంగా మారింది. మేం ఆంజనేయ స్వామి భక్తులం. అన్నయ్యకు అబ్బాయి పుట్టాడని మా నాన్న గారు ఎంతో ఆలోచించి రామ్ చరణ్ అని పేరు పెట్టారు. రాముని చరణాల వద్ద ఉండే వాడు ఆంజనేయుడు. ఎంత బలం ఉన్నా వినయ విధేయంగా ఉంటాడు. అందుకే రామ్ చరణ్ అని మా నాన్న పేరు పెట్టారు. నాకు చిరంజీవి పితృసమానులు. నేను రామ్ చరణ్‌కు బాబాయ్‌లా ఉండను. రామ్ చరణ్ నాకు సోదర సమానుడు.

రామ్ చరణ్ రంగస్థలం సినిమాకు అవార్డు వస్తుందని అనుకున్నాను. గోదారి తీర ప్రాంతాల్లో జీవించకపోయినా.. అద్భుతంగా నటించాడు. తండ్రి మెగాస్టార్ అయితే కొడుకు గ్లోబల్ స్టార్ అవుతాడు. సంకల్ప బలం, పట్టుదల, కార్యదక్షత ఉంటే.. అందరూ మెగాస్టార్ చిరంజీవిలా ఎదగొచ్చు. ఆయన అంతలా ఎదగబట్టే నేను ఈ రోజు ఇలా ఈ స్థాయిలో ఉన్నాను.

మా అన్నయ్య చిరంజీవి షూటింగ్‌లు చేసి ఇంటికి అలిసిపోయి వచ్చేవారు. ఆ టైంలో ఖాళీగా ఉండే నేను.. ఆయన షూస్, సాక్సులు తీసి కాళ్లు తుడిచేవాడిని. ఈ హీరో అవ్వాలని జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు. సర్వేజనా సుఖినోభవంతు అని మా తండ్రి గారు మాకు నేర్పించారు. అందరూ బాగుండాలని మేం కోరుకుంటాం.

రామ్ చరణ్ హార్స్ రైడింగ్ చూస్తే నాకు అసూయగా అనిపిస్తుంది. నాకు హార్స్ రైడింగ్ రాదు. కానీ గబ్బర్ సింగ్ టైంలో హార్స్ రైడింగ్ పెట్టారు. నాకు హార్స్ రైడింగ్ రాదు అని గుర్రం దగ్గరకు వెళ్లి చెప్పా. దానికి క్యారెట్ పెట్టాను. అది నన్ను సురక్షితంగా తీసుకెళ్లింది. కానీ రామ్ చరణ్ మాత్రం హార్స్ రైడింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు.

ఈ గేమ్ చేంజర్ ట్రైలర్ చూశాను. నాకు చాలా నచ్చింది. సామాజిక సందేశం ఇచ్చేలా ఉందనిపిస్తోంది.

టికెట్ రేట్లు డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. తెలుగు సినిమా స్థాయి పెరిగింది. ప్రతీ టికెట్ మీద జీఎస్టీ ఉంటుంది. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. సినిమా రంగానికి రాజకీయ రంగు పులమడం నాక్కూడా ఇష్టం ఉండదు. అన్ని ఇండస్ట్రీల వ్యక్తులు కలిసి సినిమాల్ని చేస్తున్నారు. హాలీవుడ్‌ని అనుకరించడం కాకుండా మన మూలాల్ని పైకి తెచ్చేలా కథల్ని తీసుకురావాలి. స్వర్గీయ ఎన్టీరామారావు ఎప్పుడూ కూడా ఎవ్వరి మీద వివక్షను చూపించలేదు. చంద్రబాబు గారు సైతం ఎప్పుడూ తెలుగు చిత్ర సీమ అభివృద్దికి దోహద పడుతూనే ఉన్నారు.

శంకర్ గారు తీసిన ఒకే ఒక్కడు, శివాజీ వంటివి చూస్తుంటే ఓ తృప్తి కలుగుతుంది. సినిమాలో మంచి చెడులూ ఉంటాయి. ఏది తీసుకోవాలనేది ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. వినోదంతో పాటు ఆలోచింపజేసే చిత్రాలు కూడా రావాలని కోరుకుంటున్నాను. విలువల్ని నేర్పించే చిత్రాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను. ఆంధ్ర ప్రదేశ్ తరుపున గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి, శంకర్ గారికి, దిల్ రాజు, శిరీష్ గార్లకు హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. ఎస్ జే సూర్య గారు చాలా మంచి దర్శకులు. ఆయనలో మంచి నటులు కూడా ఉన్నారు. నటుడు కావాలనే కోరిక ఉందని ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. నటుడిగా ఆయన అందరినీ ఆకట్టుకుంటున్నారు. గేమ్ చేంజర్ టీంకు ఆల్ ది బెస్ట్. కొత్త సంవత్సరంలో బాక్సాఫీస్ బద్దలైపోవాలి. మగధీరుడు, అల్లూరి సీతారామరాజుగా జీవించేశాడు. రామ్ చరణ్ అందరి హీరోలకు చాలా మంచి ఫ్రెండ్.. ఏడాదికి కనీసం వంద రోజులు అయ్యప్ప మాల, ఆంజనేయ స్వామి మాల అని అంటాడు. అహంకారం రాకుండా ఉండాలని చేస్తుంటాని చెబుతుంటాడు. ఆస్కార్ వరకు వెళ్లినా ఒదిగే ఉంటాడు. ఉంటే సూట్‌లో కనిపిస్తాడు.. లేదంటే అయ్యప్ప మాలలో చెప్పులు లేకుండా కనిపిస్తాడు.. రామ్ చరణ్ మా బంగారం.. నా తమ్ముడులాంటి వాడు.. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండేవాడు.. అద్భుత విజయాలు కలగాలని బాబాయ్‌గానే కాకుండా అన్నగానూ ఆశీర్వదిస్తున్నాను.”

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Sobhita
    అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita
  • Pooja Hegde
    Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!
  • Samantha
    తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: కొత్తగా కథలు వింటున్నాను
  • Naga Durga
    Naga Durga: ఎన్నో కండీషన్లు, అయినా అవకాశాలు!
  • Prithviraj Sukumaran
    Prithviraj Sukumaran: హీరో కాలులో 3 స్క్రూలు!
  • Preity Mukhundhan
    Preity Mukhundhan: ఈ ఆరు ‘ప్రీతి’పాత్రమైనవి
  • Venkatesh
    Venkatesh: రెండు హిట్లతో పారితోషికం భారీగా పెంపు
  • Nani
    The Paradise: నాని తెగ వర్రీ అవుతున్నారట
  • Sai Pallavi
    తెలిసి కూడా ముద్దు అడుగుతుంటారు: Sai Pallavi
  • Nidhhi Agerwal
    Nidhhi Agerwal: డబ్బున్న మగాడు కోసం వెదుకుతున్నాను!
  • Kiara Advani and Yash in Toxic
    Toxic: ఆ పుకార్లు నిజం కాదని ప్రూవ్ చేసింది కియరా
  • Krithi Shetty
    Krithi Shetty: నన్ను గ్లామర్ కి వాడుకొండి అని చెప్తోందా!
  • Nagabandham, Akhanda 2 and Hari Hara Veera Mallu,
    Sanathana ట్రెండ్ తెలుగు సినిమాలకు కలిసి రావడం లేదా?
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ఇన్ స్టాలో అందాల ఆరబోత, సినిమాల్లో నో గ్లామర్!

Recent News

  • అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita
  • Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!
  • Anna Raajan: ‘జైలర్ 2’ భామ మార్ఫింగ్ ఫోటో, పోలీసు కేసు
  • Rukmini Vasanth: సూపర్ స్టార్ సినిమాలో ‘కాంతార’ బ్యూటీ
  • తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes