Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

వచ్చే ఏడాది ప్రియా భవానీ పెళ్లి

Admin, August 7, 2024
Priya Bhavani Shankar

మొన్నటికిమొన్న హీరోయిన్ సోనాక్షి సిన్హా పెళ్లి చేసుకుంది. తాజాగా హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ కూడా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. గడిచిన రెండేళ్లుగా హీరోయిన్లు వరుసపెట్టి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో భామ చేరింది. ఆమె పేరు ప్రియా భవానీ శంకర్.

తమిళ, తెలుగు చిత్రాలతో పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ.. పరిశ్రమకు రాకముందు నుంచే రాజ్ వేల్ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తోంది. దాదాపు పదేళ్లుగా వీళ్లిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారు. అతడితో ఏడు అడుగులు నడిచేందుకు సిద్ధపడింది ప్రియా భవానీ శంకర్. వచ్చే ఏడాది తామిద్దరం పెళ్లి చేసుకుంటామని ప్రకటించింది.

న్యూస్ యాంకర్ గా కెరీర్ ప్రారంభించి హీరోయిన్ స్థాయికి ఎదిగింది ప్రియా భవానీ శంకర్. గతేడాది రిలీజైన “కల్యాణం కమనీయం” అనే సినిమాతో ఆమె తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఈ ఇయర్ “భీమా” సినిమాలో నటించింది. ఇక తాజాగా “భారతీయుడు-2″లో కూడా ఓ కీలక పాత్ర పోషించింది.

ప్రస్తుతం ఆమె తెలుగులో సత్యదేవ్ హీరోగా “జీబ్రా” అనే సినిమాలో నటిస్తోంది. అటు “ఇండియన్-3” కోసం కూడా రెడీ అవుతోంది. నాగచైతన్య నటించిన “ధూత” వెబ్ సిరీస్ లో అతడికి భార్యగా కూడా నటించింది. 

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Katrina Kaif
    Katrina Kaif: ‘స్పిరిట్’లో ఆమె ఎంట్రీ.. అవన్నీ రూమర్లేనట!
  • Akhil Akkineni, Zainab Ravdjee
    తన భార్యపై ట్రోలింగ్… తాజాగా స్పందించిన Akhil Akkineni
  • Devara
    Devara: అంచనాల కంటే 50 శాతం ఎక్కువ వసూలు చేసింది!
  • Jayakrishna Ghattamaneni
    Jaya Krishna Ghattamaneni: మొదటి చిత్రం…మొదటి ముచ్చట్లు
  • Sri Gouri Priya
    Sri Gouri Priya: తెలుగు అమ్మాయికి గుర్తింపు వచ్చింది!
  • Toxic
    Toxic నిర్మాత: పెద్దల కోసమని చెప్పాం, ట్రోలింగ్ ఎందుకిక?
  • Dragon, Varanasi and Spirit
    Summer 2027: డ్రాగన్, వారణాసి, స్పిరిట్ చిత్రాలతో కలెక్షన్ల పండుగ
  • Shalini Kondepudi in Sing Geetham
    Shalini Kondepudi: దర్శకురాలిగా మారబోతున్న హీరోయిన్
  • Mrunal Thakur
    Mrunal Thakur: నాలుగేళ్ల కిందటి మూవీకి ఇప్పుడు మోక్షం
  • Lenin
    పోకిరి అంటే పిచ్చి అంటున్న Akhil Akkineni
  • Kajal Aggarwal
    నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే: Kajal Aggarwal
  • Nabha Natesh
    Nabha Natesh: రెండు సినిమాలపై ఆశలు, ఒకటి పోయింది
  • Rashmika Mandanna
    Rashmika Mandannaకి వీరితో జోడి కుదిరేనా?
  • Varanasi
    Varanasi: రాజమౌళి మూవీ ఏప్రిల్ 7 నుంచి వాయిదా పడుతుందా?
  • Srinidhi shetty
    Srinidhi Shetty: నిర్మాతల కోరికని మన్నించని అందాల నిధి

Recent News

  • Katrina Kaif: ‘స్పిరిట్’లో ఆమె ఎంట్రీ.. అవన్నీ రూమర్లేనట!
  • Dhanush: రజినీ తర్వాత బీజేపీ గుప్పిట్లో ఉన్న తమిళ హీరో!
  • తన భార్యపై ట్రోలింగ్… తాజాగా స్పందించిన Akhil Akkineni
  • Irumudi: రవితేజ సినిమా విడుదల వాయిదా పడిందా?
  • Devara: అంచనాల కంటే 50 శాతం ఎక్కువ వసూలు చేసింది!
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes