
అయోధ్యలో అభివృద్ధి చెందుతున్న అత్యంత విలాసవంతమైన ‘ది సరయు’ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ (Ranbir Kapoor) తాజాగా ఒక ప్లాట్ కొనుగోలు చేశాడు. ఈ ప్రాజెక్టులో అమితాబ్ తర్వాత పెట్టుబడి పెట్టిన రెండో బాలీవుడ్ స్టార్‌గా రణబీర్ నిలిచాడు.
2,134 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ ప్రాపర్టీని 3.31 కోట్ల రూపాయలకు దక్కించుకున్నాడు రణబీర్. అయోధ్య వంటి ఆధ్యాత్మిక నగరంలో లగ్జరీ ప్లాట్లపై పెరుగుతున్న డిమాండ్‌కు ఈ కొనుగోలు నిదర్శనంగా నిలింది.
రణబీర్ కపూర్ ప్రస్తుతం ‘రామాయణ’ (Ramayana) చిత్రంలో శ్రీరాముడి పాత్రను పోషిస్తున్నారు. అతడిప్పుడు నిజజీవితంలో కూడా అయోధ్య వాసి అయ్యాడు. లోధా గ్రూప్ చేపట్టిన ఈ 75 ఎకరాల భారీ ప్రాజెక్టు, సరయు నదీ తీరాన కొలువుదీరింది.
ఈ ఏడాది మార్చిలో అమితాబ్ ఇందులో ఓ ప్రాపర్టీ తీసుకున్నారు. 35 కోట్ రూపాయలు పెట్టి, 2.67 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. 2024, 2025 సంవత్సరాల్లో కూడా దాదాపు 54 కోట్ల రూపాయలు పెట్టి, ఇదే వెంచర్ లో విలువైన ప్లాట్లను దక్కించుకున్నారు బిగ్ బి.
చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు అయోధ్యను కేవలం డివోషనల్ హబ్ గా చూడట్లేదు. ఇది మరో ఇండియా గేట్ వేగా మారుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే అంతా అయోధ్యలో పెట్టుబడులు పెడుతున్నారు.
