ఆ ఇద్దరి బాకీ తీర్చేస్తారట

TeluguCinema Team 22 Nov 2025
OG

పవన్ కళ్యాణ్ ఇంతకుముందు ఒప్పుకున్న లేదా మొదలుపెట్టిన సినిమాలన్నీ పూర్తి అయ్యాయి. “ఉస్తాద్ భగత్ సింగ్” విడుదలైతే పవన్ షూటింగ్ పూర్తి చేసిన సినిమాలన్నీ అయిపోయినట్లే. ఈ సినిమా వచ్చే వేసవి సెలవుల్లో విడుదల కానుంది.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆ బాధ్యతలతో బిజీగా ఉన్నారు. ఐతే, ఆయన సినిమాలు పూర్తిగా మానెయ్యడం లేదు. వచ్చే ఎన్నికలకు ముందు మరో రెండు సినిమాలు చేస్తారు అని టాక్.

తన జనసేన పార్టీకి ఆర్థికంగా ఎంతో అండదండలు ఇచ్చిన నిర్మాత రామ్ తాళ్లూరికి ఒక సినిమా చేస్తానని పవన్ కళ్యాణ్ చాలా కాలం క్రితమే ప్రకటించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేయాలనుకున్నారు. కానీ అది ఆగిపోయింది. ఆ సినిమా ఆగిపోయినా ఆ నిర్మాతకు మాత్రం వచ్చే ఎన్నికలకు ముందు ఒక మూవీ చేస్తారట.

ఇక తనకు, తన కుటుంబానికి క్లిష్ట సమయంలో ఆర్థిక సహాయం చేసిన మరో అగ్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కి కూడా ఒక సినిమా చేస్తానని మాటిచ్చారు పవన్ కళ్యాణ్. సో, రామ్ తాళ్లూరి, ఇటు విశ్వప్రసాద్ కి ఉన్న “బాకీ” (సినిమా చేస్తాను అన్న మాట) తీర్చేస్తారట.

ఇప్పటికే వేరే విధంగా వారికి హెల్ప్ చేశారు పవన్ కళ్యాణ్. రామ్ తాళ్లూరికి ఇప్పటికే తన పార్టీలో ఒక పదవి ఇచ్చారు. విశ్వప్రసాద్ కి కర్నూలు వద్ద ఆయన పెట్టే కంపెనీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూమి ఇచ్చేలా చేశారు. ఇక సినిమాలు కూడా చేసేస్తే సరిపోతుంది.

TeluguCinema Team

TeluguCinema Desk is the editorial team behind TeluguCinema.com, one of the oldest and most trusted websites dedicated to the Telugu film industry since the late 1990s. With decades of experience in entertainment journalism, the team is committed to delivering accurate news, credible reports, exclusive updates, and insightful features while upholding the highest standards of fairness, authenticity, and journalistic integrity.

View all posts

Recent News