పూజతో ముద్దు వద్దట

Pooja Hegde


హీరోయిన్ పూజ హెగ్డేతో ముద్దు పెట్టే అవకాశం రావాలని కోరుకునే వాళ్ళు బోలెడు మంది. కానీ, ఒకవేళ వస్తే వద్దనుకునే వాళ్ళుంటారా? అలాంటి వారి అరుదైన వారి జాబితాలో అడివి శేషుని చేర్చాలి.

నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తూనే ‘అన్‌స్టాపబుల్’ టాక్ షోకి శర్వానంద్‌తో కలిసి అతిథిగా హాజరయ్యాడు అడివి శేష్‌. ఏ హీరోయిన్‌తో కిస్ వద్దురా బాబూ అనిపిస్తుంది అని బాలయ్య అడిగారు. పూజ హెగ్డే అని జవాబు ఇచ్చాడు అడివి శేష్.

అలా పూజ హెగ్డేతో ముద్దు వద్దు అనుకున్న మొదటి మగాడిగా శేష్ నిలిచిపోయాడు.

మరోవైపు, పూజ హెగ్డే తన కొత్త సినిమాల షూటింగులు ఎప్పుడు ప్రారంభం అవుతాయో తెలియక ఇబ్బంది పడుతోంది. మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమా ఒప్పుకొని చాలా కాలమే అయింది. కానీ, ఈ సినిమాలో తన పని కోసం ఇంకా పిలుపు రాలేదు.

 

More

Related Stories