మూడేళ్ళ తర్వాత ముంబైలో ప్రియాంక

ప్రియాంక చోప్రా అమెరికాలో స్థిరపడింది. భర్త నిక్ జోనస్ తో అక్కడే కాపురం. ఇటీవలే సరోగసీ ద్వారా కూతురుని కూడా కన్నది ప్రియాంక చోప్రా. గత మూడేళ్ళుగా ఇండియాకి దూరంగా ఉంది. ఇప్పుడు ముంబైకి వచ్చింది.

మూడేళ్ళ లాంగ్ గ్యాప్ తర్వాత ఇండియాకి వచ్చిన ఆనందంలో ముంబై సీలింక్ బ్రిడ్జ్ బ్యాక్ డ్రాప్ లో నిల్చొని టీ తాగుతూ ఫోటో దిగింది. ఆ ఫోటోలను షేర్ చేసింది ప్రియాంక చోప్రా.

నైకా తదితర బ్రాండ్స్ కి ఆమె ప్రచారం చేస్తోంది. ఆ యాడ్స్ షూటింగ్ కోసం ముంబై వచ్చింది. అలాగే యునిసెఫ్ కి సంబందించిన ఒక కార్యక్రమంలో ఆమె పాల్గొననుంది.

బాలీవుడ్ లో కొత్తగా సినిమాలు ఒప్పుకునే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. దాదాపు 83 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు ప్రియాంకకి ఇన్ స్టాగ్రామ్ లో. హాలీవుడ్, అమెరికా చిత్రాలు చేసిన తర్వాతే అంత ఫాలోయింగ్ ఏర్పడింది. ఆమె ఇప్పుడు గ్లోబల్ తార.

 

More

Related Stories