
చాలా గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ‘హరి హర వీరమల్లు’ చిత్రం షూటింగ్ ని మంగళవారం మొదలుపెట్టారు. ఒక యాక్షన్ ఎపిసోడ్ ని చిత్రకరిస్తున్నారు దర్శకుడు క్రిష్.
ఇంటర్వెల్ ఎపిసోడ్ కి సంబందించిన కీలక సన్నివేశాలను పవన్ కళ్యాణ్, ఫైటర్స్ పై తీస్తున్నారు.
కరోనాకి ముందు మొదలైంది ‘హరి హర వీరమల్లు’. ఐతే, కరోనాతో పాటు పవన్ కళ్యాణ్ రాజకీయ పనుల కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అయింది. మరో ఏడాదిన్నర కాలంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందుకే, ఈ సినిమాని త్వరగా పూర్తి చెయ్యాలని పట్టుదలగా ఉన్నారు పవన్ కళ్యాణ్. ఈ సినిమాకే అన్ని డేట్స్ ఇచ్చారు.
ఔరంగజేబు కాలంలో జరిగే కథ ఇది. ఔరంగజేబు పాత్రకి బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ని రప్పిస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వస్తుంది.
క్రిష్ దర్శకత్వంలో ఏ ఎం రత్నం నిర్మిస్తున్న ‘హరిహర వీరమల్లు’ వచ్చే వేసవిలో విడుదల కానుంది.