
కరోనా కారణమో, మరోటో తెలియదు కానీ హీరోయిన్ తేజస్వి మడివాడ గత కొన్ని నెలలుగా గ్లామర్ షోకి దూరమైంది. కరోనాకి ముందు ఇన్ స్టాగ్రామ్ లో ప్రతిరోజూ హాట్ హాట్ ఫోటోలు షేర్ చేసేది. సోషల్ మీడియాలో వాతావరణాన్ని హీట్ చేసేది. కానీ ఇప్పుడు ఆ హడావిడి బాగా తగ్గించింది. దాంతో, ఆమెకి ఫాలోవర్స్ కూడా పెద్దగా పెరగడం లేదిప్పుడు.
మళ్ళీ అభిమానుల సంఖ్య పెంచుకోవాలనుకుంటోంది కాబోలు మళ్ళీ హాట్ ఫోటోలను పోస్ట్ చెయ్యడం మొదలు పెట్టింది. ఆదివారం ఆమె కొత్త ఫోటోషూట్ నుంచి కొన్ని ఫోటోలు షేర్ చేసింది. టైట్ డ్రెస్ వేసుకొని తన పరువాల హొయలు చూపింది.
ఈ ఫోటోలకు తెగ లైకులు వచ్చాయి. మరి తేజస్వికి సినిమాల్లో మళ్ళీ అవకాశాలు పెరుగుతాయా?
ALSO CHECK: Tejaswi Madivada’s hot sizzling poses

ఒకప్పుడు హీరోయిన్ లకు ఫ్రెండ్ గా, హీరోయిన్ గా సినిమాల్లో తరుచుగా కనిపించేది. ఐతే, ఆమె తనంతట తాను సినిమాలు తగ్గించుకొంది. ప్రపంచ యాత్రలు చేసింది. సినిమా ఆఫర్లు ఆటోమేటిక్ గ్గా తగ్గాయి.