బన్ని లిస్టులోకి ‘జైలర్’ దర్శకుడు!

Allu Arjun

అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ఆయన మార్కెట్ బాగా పెరిగింది. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు కూడా దక్కించుకొని తెలుగు సినిమా రంగంలో కొత్త చరిత్ర లిఖించాడు బన్ని. దాంతో ఈ ఊపులో పలువురు దర్శకులతో సినిమాలు చేసేందుకు చర్చలు జరుపుతున్నాడు బన్ని. ఐతే, ఇందులో ఎన్ని నిజంగా సెట్ పైకి వెళ్తాయో చూడాలి.

ప్రస్తుతం అల్లు అర్జున్ “పుష్ప 2” షూటింగ్లో ఉన్నారు. “పుష్ప 2” తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్లో మూవీ చేస్తారు.

ఆ తర్వాత సినిమా చేసేందుకు దర్శకుడు బోయపాటి, అట్లీ వంటివారు ఉన్నారు అని ఇంతకుముందు వార్తలు వచ్చాయి. కానీ, అట్లీ బన్నీతో ఇప్పుడు మూవీ చేసే ఛాన్స్ లేదు అని తెలుగుసినిమా.కామ్ ఇప్పటికే చెప్పింది. “జవాన్” సూపర్ హిట్ తర్వాత అట్లీకి బాలీవుడ్ లోనే పెద్ద ఆఫర్లు ఉన్నాయి.

ఇక “జైలర్” దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తాజాగా అల్లు అర్జున్ ని కలిశారు. త్వరలో కలిసి చేద్దాం అనుకున్నారట. కానీ అల్లు అర్జున్ సినిమా సెట్స్ పైకి వెళ్లేంతవరకు డౌట్ గానే చూడాలి. ప్రస్తుతానికి ఐతే త్రివిక్రమ్ మూవీ మాత్రమే “పుష్ప2” తర్వాత సెట్స్ పైకి ఎక్కేలా ఉంది.

Advertisement
 

More

Related Stories