ఓజీ, సాహోల మధ్య లింక్ ఉందా?

Saaho and OG

మరో రెండు రోజుల్లో ఓజీ విడుదల కానుంది. తాజాగా “ఓజీ” ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ బెంగాల్ టైగర్ గా వేరే చోటు నుంచి ముంబైకి తిరిగి వస్తున్నట్లుగా చూపించారు. ఐతే, ఈ సినిమా కథకి, ప్రభాస్ నటించిన “సాహో” సినిమా కథకి లింక్ ఉందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది.

“సాహో” సినిమాని కూడా సుజీత్ తీశాడు. ప్రభాస్ కూడా ఒక చోట “ఓజీ”లో కన్పిస్తాడనే రూమర్ ఉంది.ఈ ప్రచారానికి బలం ఇస్తూ ఈ రోజు విడుదలైన “ఓజీ” ట్రైలర్ లో ఒక చోట “వాజి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్ పోర్ట్స్” అనే ఒక షిప్ యార్డ్ కంటైనర్ పై కనిపించింది.

ప్రభాస్ నటించిన “సాహో”లో జాకీష్రాఫ్ పాత్ర కూడా వాజి అనే నగరం నుంచే తన మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిస్తుంటాడు. దాంతో, అభిమానులు “సాహో” కథకి, “ఓజి” కథకి లింక్ ఉందని కన్ఫర్మ్ అయ్యారు.

ఐతే ఇలాంటి అభిమానుల థియరీలు ఎలా ఉన్నా సినిమాలో ప్రభాస్ కనిపించకపోవచ్చు. కేవలం మాఫియా నేపథ్యం, వాజి నగరం లింక్ మాత్రమే ఈ రెండు సినిమాల మధ్య సారూప్యత ఉండొచ్చు అనే వారూ కూడా ఉన్నారు. నిజం ఏంటో తెలియాలంటే ఎల్లుండి ప్రీమియర్ షో వరకు ఆగాల్సిందే.

https://www.youtube.com/watch?v=_8J8LwoVH_0

More

 

Related Stories