మోహన్ లాల్ ‘దృశ్యం 3’ షురూ

మోహన్ లాల్ కి ఇటీవలే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మరోవైపు, మోహన్ లాల్ మరో సూపర్ హిట్ కోసం కొత్త సినిమా మొదలుపెట్టారు. మోహన్ లాల్ కెరీర్ లో “దృశ్యం” చిత్రం ప్రత్యేకం. ఆ సినిమా మలయాళంలో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత వచ్చిన “దృశ్యం 2” కూడా బాగా ఆడింది.
ఇక ఆ సినిమాలో హిందీలో, తెలుగులో కూడా రీమేక్ అయి హిట్టయ్యాయి. ఇప్పుడు మోహన్ లాల్ “దృశ్యం 3” మొదలైంది. ఈ రోజు కొచ్చిలో షూటింగ్ ప్రారంభించారు.
మోహన్ లాల్ తాను రెండు భాగాల్లో పోషించిన పాత్రలోనే కనిపిస్తారు. ఆయన భార్యగా మీనా నటిస్తోంది.
తెలుగులో కూడా మోహన్ లాల్ ఈ సినిమాని విడుదల చేస్తారా లేదా ఎప్పటిలాగే వెంకటేష్ కే రీమేక్ చేసుకునే అవకాశం ఇస్తారా అనేది చూడాలి. “దృశ్యం”, “దృశ్యం 2” వెంకటేష్ హీరోగా తెలుగులో రీమేక్ చేశారు. ఇక హిందీలో అజయ్ దేవగన్ రీమేక్ చేశారు.