హవ్వ! జవాన్ ఆస్కార్ డ్రీమ్స్!

Jawan

“ఆర్ ఆర్ ఆర్” సినిమా ఆస్కార్ వరకు వెళ్లేసరికి ఇప్పుడు భారతీయ ఫిలిం మేకర్స్, హీరోలందరికీ తమ సినిమాలను కూడా ఆస్కార్ బరిలో నిలపాలనే కోరిక పుట్టింది. “నాటు నాటు” పాటకు ఆస్కార్ వచ్చేలా రాజమౌళి అండ్ టీం గట్టిగా ప్రోమోట్ చేశారు. ఆస్కార్ అందుకున్నారు. ఇప్పుడు మిగతా కమర్షియల్ సినిమాలు కూడా అదే బాట పడుతున్నాయి.

“పుష్ప 2” సినిమాని కూడా ఆస్కార్ కోసం టార్గెట్ చేస్తారనే టాక్ ఉంది. ఐతే, “పుష్ప 2” కన్నా ముందే “జవాన్” టీం ఊవిళ్లురూతోంది.

“జవాన్” సినిమా ఒక కిచిడీ చిత్రం. సినిమా రికార్డు కలెక్షన్లు సాధించిన మాట నిజమే కానీ, “మనీ హేస్ట్” అనే వెబ్ సిరీస్ ని పూర్తిగా లేపి దానికి పాత తెలుగు, తమిళ చిత్రాల సీన్లు (విజయేంద్రవర్మ, అపరిచితుడు, వంటివి) కలిపి మిక్సీలో వేసి తీశారు దర్శకుడు అట్లీ. ఐతే, రాజమౌళి కూడా విదేశీ చిత్రాల సీన్లు, ఫైట్లు కాపీ కొట్టి ఆస్కార్ వరకు వెళ్ళినప్పుడు తామేం తక్కువనా అని “జవాన్” టీం భావిస్తోంది.

ఇకపై ప్రతి మసాలా సినిమా తీసే దర్శకుడు “ఆస్కార్” మాట మాట్లాడుతారేమో. “బాహుబలి” చిత్రాలతో రాజమౌళి అందరికీ “పాన్ ఇండియా” పిచ్చి పట్టించారు. “ఆర్ ఆర్ ఆర్”తో ఆస్కార్ కలలు కనేలా చేశారు.

Advertisement
 

More

Related Stories