ప్రగ్యా పార్టీలకే పరిమితం!

TeluguCinema Team 19 Sep 2023
Pragya


ప్రగ్య జైస్వాల్ కెరీర్ కి మళ్ళీ ఊపు వచ్చే అవకాశం లేదా? ఈ ప్రశ్నకు సమాధానం అవును అనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఈ భామకి ఒక్క ఆఫర్ రావడం లేదు. రెండేళ్ల కాలంలో ఒక్క సినిమాలో కూడా నటించేందుకు అవకాశం రాలేదు అంటే ఇక కెరీర్ పూర్తిగా స్లంప్ లో పడినట్లే.

ఆమె నటించిన “అఖండ” సినిమా 2021 డిసెంబర్లో విడుదలైంది. రెండు నెలలు ఆగితే రెండేళ్లు పూర్తి. అంత పెద్ద హిట్ తర్వాత కూడా ఆమెకి ఇంకో ఛాన్స్ రాలేదంటే ఆమె టాలెంట్ పై దర్శక, నిర్మాతలకు ఉన్న అపనమ్మకం అనుకోవాలా?

ఐతే, బోయపాటి తాను తీసే “అఖండ 2″లో మళ్ళీ ఛాన్స్ ఇస్తాడని ఆమె ఆశపడుతోంది. వచ్చే ఏడాది బాలయ్య హీరోగా “అఖండ” సీక్వెల్ తీసేందుకు ప్లాన్ చేస్తున్నారు బోయపాటి.

ఈ గ్యాప్ లో మాత్రం ఈ భామ పార్టీలతో హంగామా చేస్తోంది. రెగ్యులర్ గా తాను అటెండ్ అయ్యే పార్టీల ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తోంది.

TeluguCinema Team

TeluguCinema Desk is the editorial team behind TeluguCinema.com, one of the oldest and most trusted websites dedicated to the Telugu film industry since the late 1990s. With decades of experience in entertainment journalism, the team is committed to delivering accurate news, credible reports, exclusive updates, and insightful features while upholding the highest standards of fairness, authenticity, and journalistic integrity.

View all posts

Recent News