కాజల్ దాచేస్తోందా?

Kajal Aggarwal


కాజల్ అగర్వాల్ గర్భవతి అన్న విషయం తెలిసిందే. అఫ్ కోర్స్, ఆమె ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చెయ్యలేదు. కానీ, కొన్ని సినిమాల నుంచి ఆమె తప్పుకొంది. ప్రెగ్నెంట్ అనే కారణమే చెప్పి ఆ సినిమాల నుంచి బయటికి వచ్చింది. అలా ఆమె తల్లి కాబోతుందన్న విషయం బయటికి పొక్కింది.

ఐతే, ఆమె ఇప్పటికీ స్లిమ్ గా ఉన్న ఫోటోలనే షేర్ చేస్తోంది. ఎక్కడా గర్భవతి అన్న ఛాయలు ఆమె ఫోటోషూట్లలో కనిపించడం లేదు. ఇవి పాత ఫొటోలా? లేక నిజంగా గర్భవతి కాలేదా? అన్న సందేహాలు వస్తున్నాయి. నిన్నా, నేడు ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తే ఇవే అనుమానాలు రేకెత్తుతున్నాయి అందరిలో.

కాజల్ ఇలా ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తోంది? ఆమె ప్లాన్ ఏంటో?

కాజల్ నటించిన ‘ఆచార్య’ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానుంది. అలాగే, ‘ఉమా’ అనే ఒక హిందీ సినిమా కూడా వచ్చే ఏడాదే వస్తుంది. ఆమె నటించిన ‘భారతీయుడు 2’ సినిమా సగంలో ఆగింది.

Advertisement

More

Related Stories