అల్లు అర్జున్ తెలుగుకే పరిమితం!

Allu Arjun

పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు రావాలనేది అల్లు అర్జున్ ప్రయత్నం. అందుకే, ‘పుష్ప’ సినిమా ఐదు భాషల్లో విడుదల కానుంది. ఐతే, డబ్బింగ్ చెప్పుకోవడంలో మాత్రం అల్లు అర్జున్ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది.

అల్లు అర్జున్ ఒక్క తెలుగులో తప్ప ఇంకో భాషలో డబ్బింగ్ చెప్పడం లేదు. కేవలం తెలుగులో మాత్రమే తన గొంతులో డైలాగులు ఉంటాయి. మిగతా భాషల్లో అక్కడి డబ్బింగ్ ఆర్టిస్టులు డైలాగులు చెప్తారు.

ప్రభాస్ హిందీలో తానే డబ్బింగ్ చెప్పుకుంటారు. ”ఆర్ ఆర్ ఆర్ “లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీలో సొంతంగా డబ్బింగ్ చెప్తున్నారు. విజయ్ దేవరకొండ తన మొదటి పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ కోసం హిందీలో తానే డైలాగులు చెప్పనున్నాడు. కానీ, మల్లు అర్జున్ గా పేరొందిన అల్లు అర్జున్ మలయాళంలో కూడా డబ్బింగ్ చెప్పడం లేదంట.

బన్నీ ఇప్పుడు రిస్క్ తీసుకోదలుచుకోలేదు. మొదటి పాన్ ఇండియా సినిమాలోనే సొంత డైలాగులు చెప్పడం కన్నా కొంచెం పేరు వచ్చాక చెప్తామని అనుకుంటున్నాడట. మొదటి సినిమాలోనే తప్పులు దొర్లితే ఇబ్బంది ఉంటుంది. అందుకే, సేఫ్ గేమ్ ప్లే చేస్తున్నారు అల్లు అర్జున్.

Advertisement
 

More

Related Stories