ఇక ప్రతి సంక్రాంతికి సినిమా

Nagarjuna in Naa Saami Ranga

నాగార్జునకి ఇటీవల పెద్దగా విజయాలు లేవు. గత కొంతకాలంగా ఆయనకు సంక్రాంతికి విడుదలైన సినిమాలే విజయాలు అందించాయి. కానీ మిగతావి అపజయాలు చూపించాయి. ఈ సంవత్సరం కూడా అదే జరిగింది.

గత ఆరేడేళ్లలో నాగార్జున నటించిన తెలుగు చిత్రాల లిస్ట్ ఇది: ఓం నమో వెంకటేశాయ, రాజు గారి గది 2, ఆఫీసర్, దేవదాసు, మన్మధుడు 2, వైల్డ్ డాగ్, బంగార్రాజు, ది ఘోస్ట్, నా సామి రంగ. ఇందులో “బంగార్రాజు”, “నా సామి రంగ” మాత్రమే విజయం సాధించాయి. రెండూ సంక్రాంతికి వచ్చిన సాదాసీదా సినిమాలే. దాంతో, నాగార్జునకి ఇప్పుడు క్లారిటీ వచ్చింది.

తాను యాక్షన్ సినిమాలు చూస్తే జనం చూడడం లేదు. అలాగే ప్రయోగాలకి కూడా పెద్దగా పట్టం కట్టడం లేదు. సో, సంక్రాంతికి ఎదో ఆంధ్రా పల్లెటూరి వాడిలా కనిపించి కాసేపు సరదాగా కనిపిస్తే జనం, తన అభిమానాలు చూస్తారు అని నాగార్జున అనుకుంటున్నారు. అందుకే, వచ్చే సంక్రాంతికి కూడా “బంగార్రాజు”లాంటి ఒక చిత్రాన్ని సెట్ చెయ్యనున్నారు.

శేఖర్ కమ్ముల తీస్తున్న సినిమాలో నాగార్జున ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ అందులో హీరో ధనుష్. సో, అది నాగార్జున మూవీ కాదు. తాను హీరోగా నటించే తదుపరి చిత్రాలన్నీ సంక్రాంతికి వచ్చేలా చూసుకుంటారట.

Advertisement
 

More

Related Stories