
తమిళ సినిమా ఇండస్ట్రీలో రజినీకాంత్, కమల్ హాసన్ లెజెండ్స్. ఇద్దరూ గొప్ప నటులు, స్టార్స్ మాత్రమే కాదు వారి ప్రభావం తమిళ సినిమా ఇండస్ట్రీపై అన్నిరకాలుగా ఉంది. ఇప్పటికీ ఇద్దరూ బిజీ నటులుగా ఉండడం విశేషం.
కమల్ హాసన్ కెరీర్ కి మళ్ళీ ఊపు వచ్చింది “విక్రమ్” సినిమాతో. దాంతో, ఆయన వరుసగా సినిమాలు చేస్తున్నారు. కమల్ హాసన్ వయసు 69 ఏళ్ళు. ఆయనకి ఇద్దరు కూతుళ్లు. రజినీతో పోల్చితే కమల్ కి పెద్ద ఆరోగ్య సమస్యలు లేవు. కానీ ఉన్న అప్పులు ఇటీవలే తీర్చిన కమల్ హాసన్ ఇప్పుడు సంపాదన కోసం సినిమాలు చేస్తున్నారు.
కమల్ చిత్రాలు ఇవే
భారతీయుడు 2
కల్కి 2898AD
థగ్ లైఫ్
అన్బరివ్ డైరెక్షన్లో మూవీ
రజినీకాంత్ వయసు 73 ఏళ్ళు. ఆయనకి ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అయినా ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఒకటి (లాల్ సలామ్) విడుదలకు సిద్ధంగా ఉంది. మరోటి షూటింగ్ లో ఉంది. ఇంకో రెండు స్టార్ట్ కానున్నాయి. ఒక్కో సినిమాకి 100 కోట్ల పైనే సంపాదిస్తారు రజినీకాంత్.
రజినీకాంత్ చిత్రాలు ఇవే
లాల్ సలామ్
వేటయ్య
లోకేష్ కనగరాజ్ మూవీ
జైలర్ 2