ఎన్టీఆర్ కి ‘మ్యాడ్’ నచ్చింది: నార్నే నితిన్

Mad Success Meet

గతవారం విడుదలైన చిత్రాల్లో మంచి విజయం అందుకున్న చిత్రం.. మ్యాడ్. ఈ సినిమా ద్వారా ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయమయ్యారు. అలాగే ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ కూడా హీరోగా అడుగుపెట్టారు. సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ లతో పాటు మెయిన్ లీడ్ లో నార్నే నితిన్ కూడా నటించారు.

సోమవారం సాయంత్రం సక్సెస్ మీట్ ను నిర్వహించారు.

“ఈ సినిమాకి ఈరోజు ఇంత మ్యాడ్ రెస్పాన్స్ ఉందంటే అది మా డైరెక్టర్ కళ్యాణ్ గారి వల్లే. కళ్యాణ్ అన్న ఇంకా చాలా సినిమాలు తీసి హిట్లు కొట్టాలి. ఆ హిట్లలో మేము ఉండాలి. ఈ సినిమాని మా అక్క(లక్ష్మి ప్రణతి), బావ(జూనియర్ ఎన్టీఆర్) చూశారు. బావకి సినిమా చాలా నచ్చింది. అక్కకి డబుల్, ట్రిపుల్ నచ్చింది. పిల్లలైతే నితిన్ మామ నితిన్ మామ అంటూ బాగా ఎంజాయ్ చేశారు,” అని నార్నే నితిన్ తెలిపారు.

ఈ సినిమా ట్రైలర్ ని కూడా గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ రిలీజ్ చేశారు.

Advertisement
 

More

Related Stories