దిల్ రాజుకి పితృవియోగం

Dil Raju


ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో విషాదం. ఆయన తండ్రి కన్నుమూశారు. దిల్ రాజు తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి ఈ రోజు తుది శ్వాస విడిచారు.

కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం (అక్టోబర్ 9) సాయంత్రం కన్నుమూశారు. ఆయనకి 86 ఏళ్ళు.

నిజామాబాద్ జిల్లా నర్సింగపల్లికి చెందిన శ్యామ్ సుందర్ రెడ్డి తన కుమారుడు వెంకట రమణ రెడ్డి (దిల్ రాజు)కి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. సినిమా రంగంలోకి అడుగుపెడుతానంటే అడ్డు చెప్పలేదు. ఆయన ప్రోత్సహంతో పంపిణీ రంగంలోకి అడుగుపెట్టిన దిల్ రాజు ఇప్పుడు అగ్రనిర్మాతగా కొనసాగుతున్నారు.

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సినిమా ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సందేశాలు పెట్టారు.

 

More

Related Stories